క్రెడిట్ కార్డ్ బిల్లు ఎక్కువ వచ్చిందా ? ఇలా చేస్తే ఒక్క రూపాయి కట్టక్కర్లేదు! డబ్బులు రీఫండ్ వచ్చే ఛాన్స్ !

 క్రెడిట్ కార్డ్ బిల్లు ఎక్కువ వచ్చిందా ? ఇలా చేస్తే ఒక్క రూపాయి కట్టక్కర్లేదు! డబ్బులు రీఫండ్ వచ్చే ఛాన్స్ !

మీరు మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ చూడగానే మీకు తెలియని లావాదేవీ(transactions) ఏదైనా కనిపిస్తే కంగారు పడకండి. అలాగే 'బ్యాంకే చూసుకుంటుందిలే' అని లాస్ట్  డేట్ వరకు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే బిల్లు కట్టే ముందే ఇలాంటి సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ముందుగానే తెలుసుకోవడం చాల మంచిది...

1. తప్పుడు ఛార్జీలు
క్రెడిట్ కార్డ్ బిల్లులో మీకు గుర్తులేని లావాదేవీ కనిపిస్తే లేదా ఒకే బిల్లు రెండుసార్లు పడినా, రీఫండ్ రావాల్సిన మొత్తం రాకపోయినా వెంటనే స్పందించండి. అది మోసపూరిత లావాదేవీయా లేక కేవలం బిల్లింగ్ పొరపాటా అనేది ముందుగా తేల్చుకోవాలి.

2. బ్యాంకుకు వెంటనే సమాచారం
అనధికార/మోసపూరిత లావాదేవీలైతే మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్, వెబ్‌సైట్ లేదా కస్టమర్ కేర్ నంబర్ ద్వారా వెంటనే బ్యాంకుకు రిపోర్ట్ చేయండి. బ్యాంకు మీ కార్డును బ్లాక్ చేసి కొత్త కార్డును జారీ చేస్తుంది.

ఆర్‌బిఐ (RBI) నిబంధనల ప్రకారం.. బ్యాంక్ లేదా థర్డ్-పార్టీ వైఫల్యం వల్ల తప్పుడు లావాదేవీ జరిగితే, దాని గురించి 3 పనిదినాల్లోగా బ్యాంకుకు సమాచారం ఇస్తే మీపై ఎలాంటి ఆర్థిక బాధ్యత ఉండదు (Zero Liability).  

3. బిల్లింగ్ వివాదం (Billing Dispute)  
లావాదేవీ నిజమైనదే అయిన.. మొత్తం తప్పుగా ఉన్నా లేదా డూప్లికేట్ బిల్లు పడినా దాన్ని మోసంగా కాకుండా 'బిల్లింగ్ వివాదం'గా రిపోర్ట్ చేయండి. దీని కోసం మీ వద్ద ఉన్న రసీదులు (Invoices), క్యాన్సిలేషన్ ఇమెయిళ్లు లేదా వ్యాపారితో జరిపిన  ఆధారాలను బ్యాంకుకు అందించండి.

4. ప్రతి వివరాల రికార్డు 
ఫిర్యాదు చేసిన మొదటి రోజు నుంచే దానికి సంబంధించిన ఆధారాలను భద్రపరచుకోవడం చాలా ముఖ్యం:
*ఫిర్యాదు చేసిన తేదీ & టైమ్
*కంప్లైంట్/టికెట్ నంబర్ (Complaint Reference Number)
*వివాదాస్పద మొత్తం వివరాలు
*కస్టమర్ కేర్ ప్రతినిధి చెప్పిన సమాచారం, పంపిన ఇమెయిళ్లు, స్క్రీన్‌షాట్లు

5. వివాదం లేని బిల్లు
క్రెడిట్ కార్డుదారులు తరచుగా చేసే పెద్ద పొరపాటు ఏంటంటే.. ఏదైనా వివాదం నడుస్తుందని మొత్తం బిల్లు కట్టకుండా  ఆపేయడం. విచారణ పూర్తయ్యే వరకు వివాదాస్పద మొత్తాన్ని (Disputed Amount) ఎలా పరిగణిస్తారో బ్యాంకును అడగండి.  ఎలాంటి అదనపు లేట్ ఫీజులు, వడ్డీలు పడకుండా ఉండటానికి వివాదం లేని మిగతా అసలు మొత్తాన్ని గడువులోగా కట్టేయండి.

6. ఫిర్యాదు తిరస్కరణ 
ఒకవేళ బ్యాంకు మీ ఫిర్యాదును తిరస్కరిస్తే, ఊరికే వదిలేయకండి. నిర్ణయానికి గల స్పష్టమైన కారణాలను, ఆధారాలను ఇవ్వమని అడగండి. మీ వద్ద అదనపు రుజువులు ఉంటే వాటిని కలిపి మళ్లీ పరిశీలించాలని (Re-consideration) కోరండి.

7. ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌ 
బ్యాంకుకు ఫిర్యాదు చేసిన 30 రోజుల్లోగా తగిన పరిష్కారం లభించకపోయినా లేదా వారి సమాధానం సంతృప్తికరంగా లేకపోయినా, మీరు ఆర్‌బిఐ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ (RBI Integrated Ombudsman) వ్యవస్థను సంప్రదించవచ్చు.
* ఇంకా ఆర్‌బిఐ కాంప్లైంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (CMS) పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఉచితంగా ఫిర్యాదు చేయవచ్చు.
*ఫిర్యాదు చేసేటప్పుడు బ్యాంకు రెస్పాన్స్, టికెట్ నంబర్, బిల్లు స్టేట్‌మెంట్‌లు జత చేయాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సూచన: ఈ వివాదాన్ని పరిష్కరిస్తామని చెప్పి ఫోన్ చేసే ఎవరితోనూ మీ OTP, PIN, CVV లేదా కార్డ్ నంబర్ షేర్ చేయకండి. బ్యాంకు ప్రతినిధులు ఎప్పుడూ మీ వ్యక్తిగత పిన్ లేదా ఓటీపీలను అడగరని గుర్తుంచుకోండి.