న్యూఢిల్లీ: ధనుకా అగ్రిటెక్ సంస్థ వరి పంటలో ఆకు, అగ్గి తెగులు నివారణ కోసం పోలిన్ పేరుతో పెస్టిసైడ్ విడుదల చేసింది. జపాన్ కంపెనీ నిప్పన్ సోడాతో సాంకేతిక ఒప్పందం కుదుర్చుకుని ఈ మందును తయారు చేశారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లోకి దీనిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ రాహుల్ ధనుకా మాట్లాడుతూ వరికి శాశ్వత రక్షణ అందించడమే లక్ష్యమన్నారు.
ఈ మందును ఎకరా భూమికి 100 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. దీని ద్వారా తెగుళ్ల బెడద తప్పుతుంది. పురుగు మందుల ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. త్వరలో మరిన్ని నూతన ఉత్పత్తులను రైతులకు అందుబాటులోకి తెస్తామని రాహుల్ ప్రకటించారు.
