హైదరాబాద్, వెలుగు: డైసన్ సంస్థ సరికొత్త వీ16 పిస్టన్ అనిమల్ కార్డ్‌లెస్ వాక్యూమ్ క్లీనర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ‘‘మా కార్డ్‌లెస్ వాక్యూమ్ క్లీనర్ వ్యర్థాలను మరింత సమర్థవంతంగా లోపలికి తీసుకుంటుంది. క్లీనర్ హెడ్‌కు రెండు బ్రష్ బార్ కోన్లు ఉంటాయి.
పొడవుగా ఉండే వెంట్రుకలను సైతం తొలగిస్తుంది. దుమ్మును పీల్చుకునే టెక్నాలజీ ఇందులో వాడాం. చెత్త తొలగింపు చాలా సులభమవుతుంది”అని కంపెనీ తెలిపింది. ఈ వాక్యూమ్ క్లీనర్ ధరను రూ.80 వేలుగా నిర్ణయించారు.
