గురుగ్రామ్లో హిట్ అండ్ రన్ కలకలం.. స్టూడెంట్ను థార్తో ఢీ కొట్టి దాడి !

గురుగ్రామ్లో హిట్ అండ్ రన్ కలకలం.. స్టూడెంట్ను థార్తో ఢీ కొట్టి దాడి !

గురుగ్రామ్ యూనివర్సిటీ గేటు దగ్గర విద్యార్థిపై థార్‌తో దాడి చేసి, దారుణంగా కొట్టిన ఘటన సీసీటీవీలో రికార్డయింది. గురుగ్రామ్‌లో ఈ హిట్ అండ్ రన్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గురుగ్రామ్‌లోని సెక్టార్ 53లో ఉన్న ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం మెయిన్ గేట్ బయట విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. వైట్ కలర్ థార్ వాహనంతో స్టూడెంట్ను ఢీ కొట్టిన తర్వాత.. కొందరు తోటి విద్యార్థులు అతనిపై దాడి చేశారు. సుమారు గంటన్నర పాటు ఈ గొడవ జరిగింది.

ఈ గొడవ, హిట్ అండ్ రన్ మొత్తం యూనివర్సిటీ గేటు బయట అమర్చిన సీసీటీవీ కెమెరాలలో రికార్డ్ అయింది. బాధిత విద్యార్థి ఫిర్యాదు ఆధారంగా.. సెక్టార్ 53 పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. థార్తో ఢీ కొట్టిన తర్వాత విద్యార్థి రోడ్డుపై పడిపోయాడు. ఈ ఘటన సెప్టెంబర్ 22వ తేదీ ఉదయం 10:30 గంటలకు జరిగింది. విశ్వవిద్యాలయంలో సైకాలజీ చదువుతున్న విద్యార్థి ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు.

స్టూడెంట్ క్యాంపస్ నుంచి బయటకు రాగానే ఆ సమయంలో ఒక తెల్లటి థార్ కారు వచ్చి ఆ విద్యార్థిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదం తర్వాత ఆ విద్యార్థి రోడ్డుపై పడిపోయాడు. కిందపడిపోయిన అతనిని కొంతమంది విద్యార్థులు కారులోంచి దిగి తన్నారు. ఈ దాడి దృశ్యాలు మెయిన్ గేట్ దగ్గర ఉన్న  సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

రెండు వర్గాలుగా చీలిపోయి విద్యార్థులు దాడి చేసుకున్నారు. పోలీసులు రెండు బ్యాచ్లను పక్షాలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. ఆరుగురు విద్యార్థులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో వార్నింగ్ ఇచ్చి పంపించేశారు.