సర్ విషయంలో ఎన్నికల సంఘంలో విభేదాలు నెలకొన్న క్రమంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ పార్టీ 48 గంటల అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. సీజేపీ అల్టిమేటంతో దిగొచ్చింది ఈసీ.. సెప్టెంబర్ 27న ఢిల్లీలో కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించేందుకు సిద్ధమైంది.
సెప్టెంబర్ 27న ఢిల్లీలో అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 20న నిర్వహించిన మొదటి ప్రత్యేక శిబిరం తర్వాత దీనిని నిర్వహిస్తున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హులైన పౌరులకు మరో అవకాశం కల్పించడమే ప్రత్యేక శిబిరం లక్ష్యమని తెలిపింది ఈసీ.
యువ ఓటర్లకు ప్రత్యేక శిబిరాలు:
సెప్టెంబర్ 27 శిబిరాలకు అదనంగా, ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న కాలేజీలు, యూనివర్సిటీలు, ఇతర విద్యా సంస్థలలో 18-25 సంవత్సరాల వయస్సు గల యువ ఓటర్ల కోసం సెప్టెంబర్ 29 మరియు 30 తేదీలలో ప్రత్యేక నమోదు శిబిరాలను నిర్వహిస్తామని తెలిపింది ఎన్నికల సంఘం.
ఈ సంస్థలలో బూత్ స్థాయి అధికారులు ఓటర్ల జాబితాలు, ఫారం-6 దరఖాస్తులతో హాజరై, అర్హులైన యువ ఓటర్లకు ఫారాలు నింపడంలో సహాయం చేస్తారని... అక్టోబర్ 1, 2026 నాటికి 18 సంవత్సరాల వయస్సు నిండిన, నిండబోతున్న వారు, ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేనివారు, నిర్దేశించిన సహాయక పత్రాలతో పాటు జాబితాలో చేర్చడం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది ఈసీ.
