బిలియనీర్ ను మోసం చేసిన మనీలెండర్స్..రూ.3వేల 700 కోట్ల షేర్లను అమ్మేశారు

బిలియనీర్ ను మోసం చేసిన మనీలెండర్స్..రూ.3వేల 700 కోట్ల షేర్లను అమ్మేశారు

అతనో బిలియనీర్.. పెట్టుబడులు పెట్టడంలో తనకు తానే సాటి.. బిట్ కాయిన్ కు బాగా డిమాండ్ ఉన్న టైంలో  పెట్టుబడులకు సిద్దమయ్యాడు..అదే అతని కొంపముంచింది. నిబంధనల పేరుతో మనీలెండర్స్ అతన్ని మోసం చేశారు. దాదాపు రూ. 3వేల 774 కోట్ల షేర్లను అమ్మేశారు. అంతపెద్ద బిలియనీరు  ఎలా మోసపోయాడు.. ఎవరు మోసం చేశారు అనే వివరాల్లోకి వెళితే.. 

రికార్డో సాలినాస్ ప్లీగో.. మెక్సికో కు చెందిన బిలియనీర్. గ్రూపో ఎలక్ట్రా కంపెనీ ఓనర్. పెట్టుబడులు పెట్టడం చాలా సరదా అతనికి. 2021లో క్రిప్టో కరెన్సీ బూమ్ లో ఉన్నపుడు అందులో ఇన్వెస్ట్ చేసే సమయంలో  లిక్వ్ డ్ క్యాష్ కావాల్సి ఉండగా అందరు ధనవంతుల లాగే తన కంపెనీ షేర్లు తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నాడు. అక్కడే అతను పప్పులో కాలేశాడు. 

వివాదం ఏంటి?

ఓ లండన్ బ్రోకర్ ద్వారా ఆస్టర్ క్యాపిటల్ ఫండ్ అనే మనీలెండర్ ను ఆశ్రయించాడు ప్లీగో. స్టాక్-బ్యాక్డ్ లోన్ డీల్‌ కుదుర్చుకున్నాడు. తన కంపెనీ కి చెందిన రూ.3వేల774 కోట్లకు పైగా షేర్లను తాకట్టు పెట్టారు. అయితే మనీలెండర్ తన కంపెనీ ఎలెక్ట్రా షేర్లను అనుమతి లేకుండా విక్రయించాడని సాలినాస్ ఆరోపించారు.  ఇది ఒప్పంద ఉల్లంఘన అని, ఈ చర్య వల్ల షేర్ ధరలపై ప్రతికూల ప్రభావం పడిందని  తనకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. ప్రైవేట్ స్టాక్-బ్యాక్డ్ లెండింగ్ మార్కెట్లలో నష్టాలను ఈ కేసు హైలైట్ చేస్తుంది.

ఎలా మోస పోయారు.. 

జూలై 2021లో కెనడియన్- రిజిస్టర్డ్ ఆస్టర్ అసెట్ కంపెనీ మేనేజ్‌మెంట్ తో ప్లీగో 31 పేజీల స్టాక్-లోన్ ఒప్పందంపై సంతకం చేశాడు.. అయితే నిబంధనలు చెక్ చేయడంలో అతని స్టాప్ కొంత నిర్లక్ష్యంగా కారణంగా ప్లీగో వేలకోట్ల షేర్లు కోల్పోవాల్సి వచ్చింది. ఎలెక్ట్రా షేర్లను పూచీకత్తుగా కాకుండా మనీలెండర్ ఆస్టర్ అసెట్ కస్టడీ ఖాతా నుంచి  తరలించి మార్కెట్‌లోకి విక్రయించింది. తద్వారా  క్యాష్ చేసుకుంది. ఇది పక్కా మోసమని ప్లీగో ఫిర్యాదు చేశాడు. తరువాత  ఆస్టర్ కంపెనీ ఓనర్ యునైటెడ్ స్టేట్స్‌లో నేర చరిత్ర కలిగిన వ్యక్తి అని ,ఆస్టర్  మేనేజింగ్ డైరెక్టర్ గ్రెగొరీ మిచెల్ ఉక్రేనియాలో జన్మించిన అమెరికన్ గా గుర్తించారు. వీరు అనే గుర్తింపు కార్డులతో మోసపూరిత సంస్థలను నిర్వహిస్తూ అధికారులను ఉపయోగించుకొని మోసాలకు పాల్పడుతున్నారని వెల్లడైంది. 

రుణదాత వైపు ఏమంటున్నారు?

రుణదాత మాత్రం ఒప్పందంలోని మార్జిన్ కాల్ నిబంధనలను అనుసరించి, మార్కెట్‌లో షేర్ ధరలు పడిపోవడంతో రిస్క్ తగ్గించుకునేందుకు షేర్లను విక్రయించామని వాదించాడు.  స్టాక్-బ్యాక్డ్ లోన్లలో ఇది సాధారణ పద్ధతి అని అన్నాడు.   ప్రైవేట్ డీల్స్‌లో నిబంధనలు స్పష్టంగా తెలియకపోవడం పారదర్శకత లోపంగా భావిస్తున్నారు.   షేర్ ధరలు ఒక్కసారిగా పడిపోతే రుణగ్రహీతకు పెద్ద నష్టం వస్తుంది.  పెద్ద మొత్తంలో షేర్లు విక్రయిస్తే ధర మరింత పడిపోవచ్చు. ఒప్పంద అర్థం పైనే వివాదం తలెత్తే అవకాశం ఉంటుంది. 

ఎలెక్ట్రా షేర్లపై ప్రభావం

ఈ వివాదం తర్వాత Grupo Elektra షేర్ ధరలలో తీవ్ర ఒడిదుడుకులు కనిపించాయి. సాధారణంగా రికార్డో సాలినాస్ వంటి హై-ప్రొఫైల్ వ్యాపారవేత్తలకు స్టాక్-బ్యాక్డ్ లోన్లు తీసుకుంటారు. ఇవి  వేగంగా లిక్విడిటీ అందిస్తాయి. కానీ మార్కెట్ పరిస్థితులపై అధిక ఆధారపడతాయి. ఈ కేసు భవిష్యత్తులో ప్రైవేట్ రుణ ఒప్పందాలపై మరింత నియంత్రణ అవసరమా అనే చర్చకు దారితీసింది.