మారుతి కార్ల ప్రియులకు షాకింగ్ న్యూస్..మళ్లీ పెరిగిన కార్ల ధరలు..రెండు నెలల్లో రెండోసారి

మారుతి కార్ల ప్రియులకు షాకింగ్ న్యూస్..మళ్లీ పెరిగిన కార్ల ధరలు..రెండు నెలల్లో రెండోసారి
  • మారుతీ సుజుకి కార్ల ధరలు మరోసారి పెంపు
  • రెండు నెలల్లో రెండోసారి ధరల పెంపు
  •  రూ.30 వేల వరకు  ధర పెంపు, ఆగస్టు 1 నుంచి అమలు 
  • ఇన్‌పుట్ ఖర్చులు పెరగడంతో కంపెనీ  నిర్ణయం
  • మోడల్‌ను బట్టి వేర్వేరుగా ధరల పెంపు 

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ .. తమ కార్ల ధరలను మరోసారి పెంచింది. ఒక్కో మోడల్​ పై రూ. 30వేల వరకు ధరలు పెంచింది. రెండు నెలల్లో ధరలు పెంచడం  ఇది రెండోసారి. ఆగస్టు 1 నుంచి పెరిగిన కార్ల ధరలు అమలులోకి వస్తాయి. ఇన్​ పుట్ ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు  సంస్థ ప్రకటించింది. మోడల్​ ను బట్టి ధరల పెంపు వేర్వేరుగా ఉంటాయని తెలిపింది.  

దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి మరోసారి కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. గత రెండు నెలల్లో ఇది రెండోసారి ధరల పెంపు కావడం గమనార్హం. ఆగస్టు 1నుంచి అన్ని మోడళ్ల కార్ల ధరలను గరిష్ఠంగా రూ. 30వేల వరకు పెరగనున్నాయి. అయితే ధరల పెంపు మోడల్‌ను బట్టి వేర్వేరుగా ఉండనున్నాయి . ముడి పదార్థాల ధరలు, తయారీ వ్యయాలు, రవాణా ఖర్చులు నిరంతరం పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.  

ఈ ఏడాది జూన్‌లో మారుతీ సుజుకి కార్ల ధరలను పెంచింది. ఇప్పుడు మరోసారి ధరలు పెరగడంతో కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులపై అదనపు భారం పడనుంది. ప్రస్తుతం ఎస్-ప్రెస్సో నుంచి ఇన్విక్టో వరకు అన్ని మోడళ్లను విక్రయిస్తోంది  మారుతి సుజుకీ.