- ఆర్థిక ఇబ్బందులతో చోరీ
మేడిపల్లి, వెలుగు: మహిళ మెడలో 3 తులాల బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లిన ఇద్దరు చైన్ స్నాచర్లను మేడిపల్లి పోలీసులు కేవలం 20 గంటల్లోనే అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 2న రాత్రి 8.20 గంటలకు ఆర్టీసీ కాలనీ వద్ద చల్లా భారతి (38) నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన స్నాచర్ఆమె మెడలోని 3 తులాల బంగారు పుస్తెలతాడును లాక్కున్నాడు. కొంతదూరంలో బైక్‌పై ఉన్న తన స్నేహితుడితో కలిసి చెంగిచెర్ల వైపు పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు స్పెషల్టీమ్స్ఏర్పాటు చేశారు.
సీసీ కెమెరాల ఆధారంగా..
సీసీ కెమెరాల ఫుటేజీ, టెక్నికల్ఎవిడెన్స్ఆధారంగా నిందితులను రాజమండ్రికి చెందిన కంగాల వీవీఎస్పీ ప్రసాద్ (39), వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన అజ్మీర వెంకటేష్ (24)గా గుర్తించామని ఏసీపీ మోహన్‌కుమార్ తెలిపారు. ప్రసాద్ డ్రైవర్‌కాగా, వెంకటేష్ ప్రైవేట్ ఎంప్లాయ్‌గా పని చేస్తున్నాడన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే చైన్ స్నాచింగ్చేసినట్టు విచారణలో వెల్లడైందని చెప్పారు. సొంత బండి అయితే దొరికిపోతామని ఓఎన్ఎన్ యాప్ ద్వారా టూ వీలర్బుక్ చేసుకుని పోచారం, చెంగిచెర్ల తదితర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారన్నారు. చివరకు భారతిని టార్గెట్‌చేసి స్నాచింగ్చేసి పారిపోయారన్నారు
