హైదరాబాద్ ఉత్తమ టీచర్ గా పీవీ సునీత

హైదరాబాద్ ఉత్తమ టీచర్ గా పీవీ సునీత

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లా పరిధిలోని రాజ్ భవన్ ప్రభుత్వ హైస్కూల్ లో ఇంగ్లిష్ చెప్పే స్కూల్ అసిస్టెంట్ పీవీ.సునీత బెస్ట్​టీచర్​అవార్డుకు ఎంపికైనట్లు డీఈవో తెలిపారు. సునీత ఐదేండ్లుగా రాజ్ భవన్ స్కూల్‌‌‌‌‌‌‌‌లో పని చేస్తున్నారు. 

ఎస్సెస్సీ పరీక్షల్లో ఇంగ్లిష్ సబ్జెక్టులో వరుసగా 100 శాతం ఉత్తీర్ణత సాధించడంతోపాటు బస్తీ ప్రాంతాల్లో పేద విద్యార్థులు ఇంగ్లిష్​భాషపై పట్టు సాధించేందుకు కృషి చేస్తున్నారు. ఆమెకు అవార్డు రావడంపై హెడ్మాస్టర్, టీచర్స్,  స్టూడెంట్స్, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.