ఇబ్రహీంపట్నం, వెలుగు: రావిర్యాల సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్లో హుండీ చోరీ చేసింది తండ్రీకొడుకులని తేల్చిన ఆదిభట్ల పోలీసులు వారిని శుక్రవారం అరెస్ట్ చేశారు. ఎల్లమ్మ టెంపుల్లో ఆగస్టు 27న తాళాలు పగలగొట్టి హుండీ ఎత్తుకెళ్లారు. సీసీ టీవీ ఫుటేజీలు చూడగా ఇద్దరు మోటార్ సైకిల్‌పై వచ్చి దొంగిలించినట్లు కనిపించింది. వారి కోసం వెతకగా బొంగుళూర్ సమీపంలో పట్టుబడ్డారు.
నిందితులు లాల్‌దర్వాజాకు చెందిన కాలీవాలా రోహిత్, ఇతడి తండ్రి కాలీవాలా సోమ్రాజ్ గా గుర్తించారు. రోహిత్ కు గతంలో పలు దేవాలయాల్లో చోరీలు చేసిన చరిత్ర ఉంది. హుండీలోని రూ.12,120 నగదు, కరిగించిన 90 తులాల వెండి కడ్డీని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రమేశ్తెలిపారు.
