కేటీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మరు : బీర్ల అయిలయ్య

కేటీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మరు : బీర్ల అయిలయ్య
  • నల్గొండలో ఆయన చిల్లర రాజకీయాలు చెల్లవు: బీర్ల అయిలయ్య

హైదరాబాద్, వెలుగు:  కేటీఆర్ పాదయాత్ర చేసినా, మోకాళ్ల యాత్ర చేసినా, పోర్లు దండాలు పెట్టినా తెలంగాణ ప్రజలు నమ్మరని.. అందులోనూ నల్గొండ జిల్లాలో ఆయన చిల్లర రాజకీయాలు అస్సలు పనిచేయవని విప్ బీర్ల అయిలయ్య ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు. నల్గొండ జిల్లాలో కేటీఆర్ జిమ్మిక్కులు చేస్తే జనం తరిమికొడ్తారని హెచ్చరించారు.

నల్గొండ జిల్లాలో ప్లోరైడ్, మూసీ మురికితో ప్రజలు ఇబ్బందుల పాలైతే పదేళ్ల పాటు అధికారంలో ఉండి ఏనాడు పట్టించుకోని బీఆర్‌‌ఎస్ నేతలు..ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మీటింగ్ పెడుతారని ప్రశ్నించారు. ఈ జిల్లాలో మిమ్మల్ని జనం తిరగనివ్వరని అయిలయ్య స్పష్టం చేశారు.