- అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బీఆర్ఎస్పార్టీ సన్నద్ధమవుతున్నది. ఆదివారం ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పార్టీ అధినేత కేసీఆర్.. బీఆర్ఎస్ఎల్పీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. సోమవారం నుంచి ప్రారంభమవుతున్న సభలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి తప్పకుండా హాజరుకావాలని కేసీఆర్ఇప్పటికే అందరికీ సమాచారమిచ్చారు.
ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యం, 22ఏ జాబితా, హైడ్రా కూల్చివేతలు, ఉద్యోగాలు వంటి అంశాలపై ఫోకస్పెట్టనున్నారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యాలపై ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు సమావేశంలో కేసీఆర్దిశానిర్దేశం చేయనున్నారు. అయితే, సీఎం రేవంత్రెడ్డి సవాల్మేరకు కేసీఆర్ ఈసారైనా అసెంబ్లీకి వస్తారా అంటే రారనే సమాధానాలే వస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై చార్జిషీట్విడుదల సందర్భంగా.. కేసీఆర్అసెంబ్లీకంటూ వస్తే మళ్లీ సీఎంగానేనని కేటీఆర్తేల్చి చెప్పారు.
