కేరళలో ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు.. నుజ్జునుజ్జయిన బీటెక్ స్టూడెంట్స్ శరీరభాగాలు

కేరళలో ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు.. నుజ్జునుజ్జయిన బీటెక్ స్టూడెంట్స్ శరీరభాగాలు

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. త్రిస్సూర్  జిల్లా పనంబిక్కున్ను దగ్గర హైవైపై ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. శుక్రవారం( సెప్టెంబర్4) అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఎనిమిది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు చనిపోయారు. కారు గురవాయూర్ నుంచి కొడంగలూరు వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. 

ప్రమాదానికి గురైన కారు నుజ్జునుజ్జు అయింది. కారులో ఇరుక్కుపోయిన విద్యార్థుల శరీర భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. అగ్నిమాపక, సహాయక సిబ్బంది,పోలీసులు, స్థానికులతో సాయంతో  బయటకు తీశారు. ప్రమాదానికి గురైన కారు తమిళనాడు రిజిస్ట్రేషన్ గల నంబర్ ప్లేట్ తో ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థులు మృతదేహాలను త్రిస్సూర్ మెడికల్ కాలేజీకి తరలించారు.