T20 World Cup: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న సౌతాఫ్రికా

T20 World Cup: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న సౌతాఫ్రికా

T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌ 2026లో సూపర్-8 దశలో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగుతుంది. కీలక మ్యాచ్‌లో టాస్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. దీంతో టీమిండియా మొదటి బౌలింగ్ చేయనుంది.  

టాస్ అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రామ్ మాట్లాడుతూ.. మేము బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం.. పిచ్ చాలా బాగుంది, గత మ్యాచ్‌లతో పోలిస్తే ప్రస్తుతం పొడిగా ఉంది.. మా ప్లేయర్స్ అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు.. ఇక్కడ ఆడటం మాకు కలిస్తోంది.. ఇది బ్లాక్ సాయిల్ పిచ్.. ఈ మ్యాచ్‌లో మేము నాలుగు మార్పులు చేశాం.. కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి, మార్కో యాన్సెన్ జట్టులోకి తిరిగి వచ్చారని వెల్లడించారు.  

భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే మేము కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనే అనుకున్నాం.. ఇది ప్రతి ఒక్కరికీ తమ ప్రతిభ చూపించుకునే మంచి అవకాశం.. మైదానంలో మా ఎనర్జీ చాలా బాగుంది.. ఫలితం ఏదైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం.. మొదట బౌలింగ్ చేయడం ఆనందంగా ఉంది.. ఈ మ్యాచ్ కి ఎలాంటి మార్పులు చేయకుండానే బరిలోకి దిగుతున్నామని సూర్యకుమార్ పేర్కొన్నారు.  

ఇరు జట్లు: 
టీమిండియా: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ( వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్‌ సింగ్‌, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చకరవర్తి. 

దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్ ), క్వింటన్ డి కాక్( వికెట్ కీపర్), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి