విడాకులిచ్చిన మాజీ భార్యపై తగ్గని ప్రేమ.. ఏకంగా రూ.4 కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన హార్ధిక్

విడాకులిచ్చిన మాజీ భార్యపై తగ్గని ప్రేమ.. ఏకంగా రూ.4 కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన హార్ధిక్

ముంబై: భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్, కుమారుడు అగస్త్యకు లగ్జరీ కారును గిఫ్ట్‎గా ఇచ్చాడు. ఏకంగా రూ.4 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును బహుమతిగా అందజేశాడు. ఈ విషయాన్ని ల్యాండ్ రోవర్ ముంబై బ్రాంచ్ వెల్లడించింది. ‘‘మిస్టర్ హార్దిక్ పాండ్యా మరోసారి డిఫెండర్‌ కారును కొనుగోలు చేయడానికి ముంబైలోని నవ్‌నిత్ మోటార్స్‌ను ఎంచుకున్నారు” అని తెలిపింది.

 స్టాంకోవిచ్, అగస్త్య స్వయంగా షోరూమ్‎కు వెళ్లి కారు తీసుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాండ్యాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. విడాకులిచ్చినప్పటికీ మాజీ భార్యపై గౌరవం, కొడుకుపై ప్రేమ ఏ మాత్రం తగ్గలేదని పాండ్యా నిరూపించాడని కొనియాడారు. 

విడాకులు తీసుకుని డబ్బుల కోసం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న ఈ రోజుల్లో కూడా మాజీ భార్య, కొడుకు పట్ల పాండ్యా విధేయతగా ఉండటం గ్రేట్ అంటున్నారు. పాండ్యా, నటాషా విడిపోయినప్పటికీ కొడుకు విషయంలో మాత్రం బెస్ట్ పేరెంట్స్‎గా ప్రశంసలు అందుకుంటున్నారు. పాండ్యా నటాషాతో డివోర్స్ తీసుకుని ప్రస్తుతం మహికా శర్మతో రిలేషన్‎లో ఉన్నప్పటికీ కొడుకు అగస్త్య తన అత్యంత ప్రాధాన్యత అని మరోసారి నిరూపించాడు. 

మోడల్, నటి అయిన నటాషా అందానికి ఆకర్షితుడైన పాండ్యా 2019 డిసెంబర్ 31న దుబాయ్‎లో ఆమె చేతికి ఉంగరం తొడిగి తన ప్రేమను వ్యక్తపరిచాడు. అనంతరం కుటుంబసభ్యుల నడుమ ఆమెను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. 2020 జులైలో నటాషా అగస్త్యకు జన్మనిచ్చింది. 

ఇక్కడితో ఊరుకోని ఈ జంట 2023 ఫిబ్రవరి 14న ఉదయుర్ (రాజస్థాన్) ప్యాలెస్లో హిందూ, క్రిస్ట్రియన్ పద్ధతుల్లో మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఇలా ఎన్ని చేసుకున్నా చివరి వరకు కలిసుండలేకపోయారు. 2024 జూలైలో పాండ్యా,  నటాషా వివాహ బంధానికి ముగింపు పలుకుతూ డివోర్స్ తీసుకున్నారు. ఆ తర్వాత పాండ్యా బ్రిటన్ సింగర్ జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నాడన్న జోరుగా ప్రచారం జరిగింది. కానీ పాండ్యా మరో మోడల్ మిహికా శర్మతో ప్రేమాయణం నడుపుతున్నాడు.