ఇండియాలో పెట్రోల్ బంకులు గత పదేళ్లలో రెట్టింపు సంఖ్యలో పెరిగాయి. రూరల్ ఏరియాల్లో కూడా వాహనాల వినియోగం గడచిన పదేళ్లలో విపరీతంగా పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెట్రోల్ బంకులు పెద్ద సంఖ్యలో ఏర్పడ్డాయి. ఫలితంగా.. అమెరికా, చైనా దేశాల తర్వాత ఎక్కువ పెట్రోల్ బంకులు ఉన్న దేశంగా ఇండియా నిలిచింది.
అమెరికా, చైనా దేశాల్లో సుమారుగా లక్షా 10 వేల నుంచి లక్షా 20 వేల దాకా పెట్రోల్ బంకులు ఉండగా.. ఇండియాలో కూడా 2025 నవంబర్ నాటికి పెట్రోల్ బంకుల సంఖ్య లక్షా 266కి చేరడం గమనార్హం. 2015తో పోలిస్తే ఈ సంఖ్య రెట్టిపైంది. అమెరికా, చైనా తర్వాత అత్యధిక పెట్రోల్ బంకులు ఉన్న మూడో దేశం ఇండియానే. ఇండియా టోటల్ నెట్ వర్క్లో.. రూరల్ ఫ్యూయల్ స్టేషన్స్ పదేళ్ల క్రితం 22 శాతం ఉండగా ప్రస్తుతం 29 శాతానికి పెరిగింది.
►ALSO READ | K-4 మిసైల్ ప్రయోగం సక్సెస్.. 3 వేల 500 కి.మీ దూరంలోని టార్గెట్ను.. సముద్రం నుంచి కొట్టిపడేయొచ్చు !
పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు మూడింట ఒక వంతు బంకులు CNG,ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సౌకర్యాన్ని వినియోగదారులకు అందిస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ దాదాపు 2 వేల 100 పెట్రోల్ బంకులను నిర్వహిస్తుండగా, నయారా ఎనర్జీ పెట్రోల్ బంకులు దాదాపు 6 వేల 900 వరకూ ఉన్నాయి. గత పదేళ్లలో ఇంధన డిమాండ్ విపరీతంగా పెరిగింది. పెట్రోల్ వినియోగం 110 శాతం, డీజిల్ డిమాండ్ 32 శాతం పెరిగింది. పెరిగిన డిమాండ్కు తగినట్లుగా పెట్రోల్ బంకులు భారీగా ఏర్పడ్డాయి.
