SA Vs AFG : రెండో సూపర్ ఓవర్ లో గెలిచిన సౌతాఫ్రికా.. చెమటలు పట్టించిన ఆఫ్గనిస్తాన్

SA Vs AFG : రెండో సూపర్ ఓవర్ లో గెలిచిన సౌతాఫ్రికా.. చెమటలు పట్టించిన ఆఫ్గనిస్తాన్

టీ 20 వరల్డ్ కప్ గ్రూపు D లీగ్ దశలో సౌతాఫ్రికా, ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. 187 పరుగులతో రెండు జట్లు మ్యాచ్ ను టై చేశాయి. దీంతో సూపర్ ఓవర్ కు వెళ్లాయి. ఫస్ట్ సూపర్ ఓవర్ లో.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్తాన్ 17 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు కూడా 17 పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్ సైతం టై అయ్యింది. 

గెలుపు కోసం రెండో సూపర్ ఓవర్ ఆడాయి రెండు జట్లు. 

రెండో సూపర్ ఓవర్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు ఆరు బాల్స్ కు 23 పరుగులు చేసింది. 
రెండో సూపర్ ఓవర్ లో సౌతాఫ్రికా నుంచి మిల్లర్, స్టబ్స్ దిగారు. ఈ ఇద్దరూ 6 బంతుల్లో 23 పరుగులు చేసి.. ఆఫ్గనిస్తాన్ జట్టుకు 24 పరుగుల టార్గెట్ ఇచ్చారు. 

24 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆఫ్గనిస్తాన్ జట్టు ఏ మాత్రం తగ్గలేదు. గుర్జాబ్ వరసగా హ్యాట్రిక్ సిక్స్ లతో సౌతాఫ్రికాకు చుక్కలు చూపించాడు. రెండో సూపర్ ఓవర్ లో లాస్ట్ బాల్ కు 6 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆఫ్గనిస్తాన్ జట్టు విఫలం అయ్యింది. రెండో సూపర్ ఓవర్లో ఆఫ్గనిస్తాన్ 19 పరుగులు మాత్రమే చేసింది.

ALSO READ : సూపర్ ఓవర్ కూడా టై.. పిచ్చెక్కిస్తున్న మ్యాచ్.. బాల్ బాల్ కు ఉత్కంఠగా..

రెండో సూపర్ ఓవర్ లో ఆఫ్గనిస్తాన్ పై.. సౌతాఫ్రికా విజయం సాధించింది. ఆ మ్యాచ్ లో రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లు పోరాడాయి. గెలుపు కోసం చివరి బంతి వరకు పోరాడాయి. మ్యాచ్ టై కావటమే కాదు.. సూపర్ ఓవర్ కూడా టై అయ్యింది. రెండో సూపర్ ఓవర్ లోనూ రెండు జట్లు అదే స్థాయిలో పరుగులు సాధించాయి. 

ఆఫ్గనిస్తాన్ జట్టు లాస్ట్ బాల్ కు సిక్స్ కొట్టినట్లయితే మ్యాచ్ మరోలా ఉండేది. ఎట్టకేలకు సౌతాఫ్రికా మ్యాచ్ గెలిచింది. ఆఫ్గనిస్తాన్ మనసులు గెలిచింది అన్నట్లు.. రెండు సూపర్ ఓవర్లతో టీ 20 వరల్డ్ కప్ లోనే అద్భుతమైన మజా మ్యాచ్ అభిమానులకు అందించాయి రెండు జట్లు..