టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్ లో అసలు సిసలు మజా మ్యాచ్ అంటే ఇదే.. సౌతాఫ్రికా, ఆఫ్గనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్.. బాల్ బాల్ ఉత్కంఠ రేపింది. గెలుపోటముల కోసం సూపర్ ఓవర్ వచ్చింది. అనూహ్యంగా.. ఊహించని విధంగా సూపర్ ఓవర్ కూడా టై అయ్యింది. సూపర్ ఓవర్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్తాన్ 17 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా టీం కూడా 17 పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్ కూడా టై అయ్యింది.
ఆఫ్గనిస్తాన్ బ్యాటింగ్
బాల్ 1 - లుంగి గిడీ టు అజ్మత్, ఫోర్ ! న్గిడి వేసిన ఆఫ్ సైడ్ లో ఫుల్ టాస్ బాల్ ను బ్యాక్‌వర్డ్ పాయింట్, షార్ట్ థర్డ్ మ్యాన్ మీదుగా గ్యాప్ లోకి పంపి 4 సాధించాడు.
బాల్ 2 - సిక్స్! ఈసారి న్గిడి వేసిన స్లో బాల్ ని సిక్స్ గా మలిచాడు అజ్మత్.
బాల్ 3 - లుంగి గిడీ వేసిన లో ఫుల్ టాస్ ని సింగల్ గా మలిచాడు అజ్మత్.
బంతి 4 - లుంగి గిడీ టు గుర్బాజ్ సింగల్, న్గిడి వేసిన ఫుల్, స్లో-బాల్ ఆఫ్-కట్టర్ బయట, గుర్బాజ్ లాంగ్-ఆన్‌కి డ్రైవ్ చేసి సింగల్ సాధించాడు.
బంతి 5 - లుంగి గిడీ టు అజ్మత్ ఫోర్ ! న్గిడి వేసిన స్లో బాల్ ఆఫ్ కట్టర్ ని ఫర్ మలిచాడు అజ్మత్.
6వ బంతి - లుంగి గిడీ టు అజ్మత్ 1 యార్కర్ ని షార్ట్ ఫైన్ షాట్ తో సింగల్ గా మలిచాడు అజ్మత్.
సౌత్ ఆఫ్రికా టార్గెట్ 18
సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్
బాల్1 - ఫరూఖీ టు మిల్లర్, సింగల్,
బాల్ 2 - ఫారూఖీ టు బ్రెవిస్, సిక్స్!
బాల్ 3 - ఫారూకి టు బ్రెవిస్, అవుట్! గుర్బాజ్ కి క్యాచ్ ఇచ్చాడు
బాల్ 4 - ఫరూఖీ టు స్టబ్స్, ఫోర్..
బాల్ 5 - ఫరూఖీ టు స్టబ్స్.. డాట్ బాల్
బాల్ 6 - ఫరూఖీ టు స్టబ్స్.. సిక్స్! దీంతో సూపర్ ఓవర్ కూడా డ్రా అయ్యింది..
