పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' . దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది సమ్మర్ లో మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, సాంగ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
'ఆరా ఆఫ్ ఉస్తాద్' సాంగ్ రెడీ
ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను స్వీడప్ చేశారు. ఇందులో భాగంగా ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం అందించిన, దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన రెండో సాంగ్ ను విడుదల చేసేందుకు సన్న ద్ధమవుతున్నారు. 'ఆరా ఆఫ్ ఉస్తాద్' పేరుతో రానున్న ఈ పాట హైఎనర్జీతో సాగుతుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి హరీశ్ శంకర్, చంద్రబోస్ కలిసి దేవిశ్రీ ని ఎత్తుకున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫ్యాన్స్ కు పూనకాలు పక్కా..
దర్శకుడు హరీశ్ మాట్లాడుతూ.. నేను సాధారణంగా ఇలా చేయను. అసలు ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు. కానీ ఈ పాట మాత్రం నిజంగా అందుకు అర్హమైనది. సాంగ్ విన్న వెంటనే తన గుండె వేగంగా కొట్టుకున్నది. మాటల్లో చెప్పడం అసాధ్యం, సంగీతం, స్వరాలు, భావోద్వేగాలు అన్ని కలిసి ఒక అద్భుతమైన అనుభూతిని కలిగించాయి' అని సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ కు జోడీగా అందాల ముద్దుగుమ్మలు శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి రెండో సాంగ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదుదుచూస్తున్నారు. అటు రాబోయే రోజుల్లో మరిన్ని అప్డేట్స్ ఇచ్చేందుకు చిత్రం ప్లాన్ చేస్తోంది.
