కుత్బుల్లాపూర్: హైదరాబాద్కు చెందిన భావన అనే మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దుండిగల్ పోలీసులను ఆశ్రయించింది. టెక్ మహీంద్రా కంపెనీ యాజమాన్యంపై బాధితురాలి ఫిర్యాదు చేసింది. అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో భావన పేర్కొంది.
కూతురి అనారోగ్యం కారణంగా 3 రోజులు సెలవు తీసుకుంటే విధుల నుంచి తొలగించారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ముందస్తుగా సమాచారం ఇచ్చినా ఉద్దేశపూర్వక వేధించారని ఆమె వాపోయింది.
వాష్‌రూమ్‌కి వెళ్లాలన్నా అనుమతి తీసుకోవాలని వేధించారంటూ బాధితురాలి ఆరోపించింది. అనారోగ్యంతో బాధపడుతున్నా విధులకు హాజరుకావాలంటూ యాజమాన్యం ఈ-మెయిల్స్ పంపి వేధించింది. సిక్ లీవ్స్ వర్తింపజేయకపోగా, బలవంతంగా పనిచేయించుకుంటున్నారని పోలీసులకు భావన ఫిర్యాదు చేశారు.
