వరుస ప్రాజెక్టులతో ఫుల్ జోరులో ఉన్న పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ అంతా ఇంతా కాదు. భారీతీయ చిత్రపరిశ్రమలో స్టార్ డమ్ కు అసలైన నిర్వచనంగా నిలుస్తున్నారు. జూన్ 2026కి గానూ 'ఆర్మాక్స్ మీడియా' రిలీజ్ చేసిన ' 'స్టార్స్ ఇండియా లవ్స్ ' జాబితాలో ప్రభాస్ మరోసారి నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు. భాషలు, సరిహద్దులతో సంబంధం లేకుండా ఆగ్రస్థానంలో నిలవడం ద్వారా డార్లింగ్ కు ఉన్న ఫాలోయింగ్ ను మరోసారి స్పష్టం చేస్తోంది.
నెంబర్ 1స్థానంలో ప్రభాస్..
'బాహుబలి' సినిమాతో భారతీయ సినిమా సరిహద్దులను చెరిపేసిన ప్రభాస్.. ఆ తర్వాత 'సలార్', 'కల్కి 2898 AD 'వంటి భారీ విజయాలతో తన మార్కెట్‌ను మరింత విస్తరించాడు. తెలుగు ప్రేక్షకులకే పరిమితం కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. నేడు దేశంలోనే అత్యంత బ్యాంకబుల్ స్టార్‌లలో ఒకరిగా కొనసాగుతున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ , కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లు... ఏ జానర్‌లోనైనా తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
ప్రభాస్ తర్వాత ఏవరంటే?
ఇక ప్రభాస్ తర్వాత రెండవస్థానంలో బాక్సాఫీస్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నిలవగా... మూడవ స్థానంలో కోలీవుడ్ స్టార్, తమిళనాడు సీఎం దళపతి విజయ్ ఉన్నారు. నాల్గవ స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఐదవ స్థానంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆరవ స్థానంలో మహేష్ బాబు ఉన్నారు. ఇక తర్వాత స్థానాల్లో వరుసగా కోలీవుడ్ స్టార్ సూర్య, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణ్ వీర్ సింగ్ లు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.
వరుస చిత్రాలతో..
డార్లింగ్ నటించే ప్రతి కొత్త సినిమా విడుదలకు ముందే అంచనాలు భారీగా ఉంటున్నాయి. లేటేస్ట్ గా ఆర్మాక్స్ మీడియా ( Ormax Media ) ర్యాంకింగ్స్ కూడా అదే విషయాన్ని మరోసారి బలంగా చాటి చెప్పింది.. ప్రస్తుతం ప్రభాస్ లైనస్ లో ఉన్న 'ఫౌజీ' విడుదల తేదీ ప్రకటనతో సోషల్ మీడియాలో భారీ హైప్ నెలకొంది. అటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పిరిట్' కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడనే వార్తలు అంచనాలను మరింత పెంచుతున్నాయి.
ఫుల్ జోష్ లో..
మరోవైపు 'సలార్ 2', 'కల్కి 2898 AD పార్ట్–2' కూడా రెడీ అవుతోంది. ఇక ఇటీవల జాతీయ పురస్కారం అందుకున్న 'కల్కి 2898 AD' విజయోత్సాహం ప్రభాస్ కెరీర్‌కు మరింత బలాన్నిచ్చాయి. ప్రతి కొత్త అప్డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా, ప్రతి కొత్త సినిమా కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూడడం ప్రభాస్‌కు మాత్రమే సాధ్యమవుతున్న అరుదైన ఘనతగా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
