TG EAPCET ఇంజనీరింగ్ సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపుపై కీలక వివరాలు వెల్లడించారు టెక్నికల్ ఎడ్యుకేషన్ శాఖ అధికారులు. మొత్తం సీట్లు 94వేల 424 ఇంజనీరింగ్ సీట్లలో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ పూర్తి అయ్యే సరికి 80వేల 167సీట్లు భర్తీ అయినట్టు తెలిపారు అధికారులు. సెకెండ్ ఫేజ్ కౌన్సిలింగ్ తరువాత 14వేల 257 సీట్లు ఖాళీ ఉన్నట్లు తెలిపారు అధికారులు.
సెకండ్ ఫేజ్ లో సీట్లు పొందిన విద్యార్థులు జులై 25 న ట్యూషన్ ఫీజు చెల్లించాలని తెలిపారు అధికారులు.సీట్లు కేటాయించిన కాలేజీలో ఈనెల 25నుండి 28 వరకు తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలని తెలిపారు అధికారులు.
ఇప్పటివరకు 84.90 శాతం ఇంజనీరింగ్ సీట్లు భర్తీ అయినట్లు తెలిపారు. సీట్ల భర్తీ, ఇతర ప్రక్రియలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారులు.
