కోరుట్ల, వెలుగు: ఏపీలో అనుమానాస్పదంగా చనిపోయిన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్‌కు చెందిన బీటెక్ స్టూడెంట్ అంకం రాహుల్ కుటుంబాన్ని బుధవారం ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పరామర్శించారు.
రాహుల్ మృతితో తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబానికి తక్షణ సాయంగా రూ.25 వేలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. అలాగే రాహుల్ చెల్లె ఇంటర్ చదువుకు పూర్తి బాధ్యత తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
