- ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో నిరసనలు
నెట్‌వర్క్, వెలుగు: నీట్ పేపర్‌ను లీక్ నేపథ్యంలో చేపట్టిన నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ పార్టీ శ్రేణులు భారీ నిరసనలకు దిగారు. బుధవారం ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలోని పలు జిల్లాకేంద్రాలతోపాటు, మండలకేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులపై లాఠీచార్జిని ఖండించారు. జగిత్యాలలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ నీట్ పరీక్షలో అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నీట్ అక్రమాల కారణంగా మనస్తాపంతో 12 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఈ మరణాలకు పీఎం మోదీ బాధ్యత వహించాలన్నారు. నిజామాబాద్‌లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ మోదీ నేతృత్వంలోని బీజేపీ తన తప్పిదాలను ప్రశ్నిస్తే ఓర్చుకోలేకపోవం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు.
