కామారెడ్డి, వెలుగు: ప్రపోజల్స్ పంపకపోతే ఫండ్స్ ఎలా వస్తాయని అధికారులపై జహీరాబాద్ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఫైర్ అయ్యారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్‌లో దిశ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఫండ్స్‌తో అమలవుతున్న స్కీమ్‌లు, డెవలప్మెంట్పనులపై రివ్యూ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చెరువుల రిపేర్లు, వాటర్ షెడ్ల నిర్మాణానికి ఫండ్స్ వచ్చే అవకాశమున్నా ప్రపోజల్స్ఎందుకు పంపలేదని ఇరిగేషన్ఆఫీసర్లను ప్రశ్నించారు. అధికారులు ప్రపోజల్స్ పంపితే తాము ఉన్నతాధికారులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులతో మాట్లాడి ఫండ్స్ తీసుకొస్తామన్నారు. గతేడాది భారీ వర్షాలతో జిల్లాలో చెరువులు దెబ్బతిన్నాయని, వాటి రిపేర్లకు అంచనాలు రెడీ చేయాలన్నారు.
యువత ఉపాధి అవకాశాల కోసం లోన్లు, సబ్సిడీ లభించే అవకాశం ఉందని, వీటిపై ఎందుకు అవగాహన కల్పించకపోవడం లేదని బ్యాంక్ అధికారులను ప్రశ్నించారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటల సాగుతో పాటు, తాగునీటి సప్లైకి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర స్కీములు ప్రజలకు అందేలా అధికారులు చూడాలన్నారు. మీటింగ్‌లో ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి, కలెక్టర్ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర, లైబ్రరీ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు విక్టర్, గిరి, మున్సిపల్ చైర్‌పర్సన్ ఉమారాణి , దిశ కమిటీ మెంబర్లు పాల్గొన్నారు..
