న్యూఢిల్లీ: వివాదాస్పద యానిమేషన్ చిత్రం ‘మహాప్రభు జగన్నాథ్’ విడుదలకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న పూరీ రథయాత్ర ముగిసిన తర్వాతే దీనిని విడుదల చేయాలని ఆదేశించింది. జులై 27తో రథయాత్ర పూర్తికానుండగా, జులై 28 లేదా ఆ తర్వాతే సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని స్పష్టం చేసింది. ఈ చిత్రంపై ఒడిశా ప్రభుత్వం, పూరీ ఆలయ ట్రస్టీలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను జస్టిస్ బీవీ నాగరత్న బెంచ్ తోసిపుచ్చింది.
