అల్లు అర్జున్ ప్రోత్సాహం మరింత ప్రత్యేకంగా నిలిపింది : శరత్ చంద్ర

అల్లు అర్జున్ ప్రోత్సాహం మరింత ప్రత్యేకంగా నిలిపింది : శరత్ చంద్ర

తెలుగు సినీ పరిశ్రమలో దశాబ్దానికి పైగా కాలంగా అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించిన  మార్కెటింగ్, డిజిటల్ ప్రమోషన్స్   వెనుక  కీలక పాత్ర పోషించిన శరత్ చంద్ర నాయుడు.. ఇప్పుడు నిర్మాతగా కూడా తన టాలెంట్‌‌‌‌ను  చాటుకుంటున్నారు. ఆయన నిర్మించిన  ‘గుర్తుకొస్తున్నాయి’  వెబ్‌‌‌‌సిరీస్  ప్రస్తుతం ఈటీవీ విన్‌‌‌‌లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ అందుకుంటోంది.

ఈ సందర్భంగా  శరత్ చంద్ర మాట్లాడుతూ ‘ఈ వెబ్‌‌‌‌సిరీస్  ప్రయాణం నా ఇన్‌‌‌‌స్టాగ్రామ్ పోడ్‌‌‌‌కాస్ట్ పేజ్  ‘రేలంగి మావయ్య’తో ప్రారంభమైంది.  అందులో నేను 90వ దశకానికి చెందిన జ్ఞాపకాలను నా స్వరంలో పంచుకుంటుంటాను.  ఆ ఎమోషన్స్‌‌‌‌ను వెబ్ సిరీస్‌‌‌‌గా తీస్తే బాగుంటుందని ఈటీవీ విన్‌‌‌‌కు చెందిన సాయి, నితిన్ చెప్పారు. మేం ఊహించినట్టే ఈ సిరీస్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది.  అల్లు అర్జున్‌‌‌‌ నుంచి లభించిన ప్రోత్సాహం మరింత ప్రత్యేకంగా నిలిపింది.   ఈ విజయంతో అల్లు అర్జున్ క్యాంప్ నుంచి మరో విజయవంతమైన నిర్మాతగా వచ్చారు అనడం, సినీ నిర్మాణ రంగంలో ఇది నా న్యూ జర్నీకి శ్రీకారం అని అందరూ భావిస్తున్నారు’ అని చెప్పారు.