బాలకృష్ణ, గోపీచంద్ మలినేని NBK 111 రిలీజ్ డేట్ ఫిక్స్..

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని NBK 111 రిలీజ్ డేట్ ఫిక్స్..

లకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.  బాలయ్య కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 111వ చిత్రం.  మంచు మనోజ్‌‌‌‌ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌‌‌‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం షూటింగ్‌‌‌‌ కోసం కాకినాడ వెళ్లారు బాలకృష్ణ. ఇదిలా ఉండగా మూవీ రిలీజ్ డేట్‌‌‌‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్‌‌‌‌డేట్‌‌‌‌ వినిపిస్తోంది.  

క్రిస్మస్‌‌‌‌ సందర్భంగా డిసెంబర్‌‌‌‌‌‌‌‌ చివరి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌‌‌‌ చేస్తున్నట్టు సమాచారం.  నిజానికి దసరా సీజన్‌‌‌‌లో రిలీజ్‌‌‌‌ కావల్సిన సినిమా ఇది.  అయితే షూటింగ్ కొంత ఆలస్యమవడంతో డిసెంబర్‌‌‌‌‌‌‌‌ తొలివారంలో రావొచ్చని అనుకున్నారు.  అయితే ఇటీవల ప్రభాస్‌‌‌‌ ‘ఫౌజీ’ సినిమా డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 3న వస్తున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలో రెండు పెద్ద సినిమాల మధ్య క్లాష్‌‌‌‌ వద్దనుకుని డిసెంబర్‌‌‌‌‌‌‌‌ ఎండింగ్‌‌‌‌కు షిప్ట్ అయినట్టు తెలుస్తోంది.  అయితే క్రిస్మస్‌‌‌‌కే రిలీజ్‌‌‌‌ ఫిక్స్‌‌‌‌ చేస్తారా లేక మరేదైనా డేట్‌‌‌‌కు వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది.  ముంబై మాఫియా నేపథ్యంలో గ్యాంగ్‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ను స్టైలిష్‌‌‌‌ లుక్‌‌‌‌లో ప్రజెంట్‌‌‌‌ చేస్తున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.