ఏడు నెలల గర్భంతోనూ దీపిక రిస్కీ యాక్షన్ సీన్స్

ఏడు నెలల గర్భంతోనూ దీపిక రిస్కీ యాక్షన్ సీన్స్

రోజుకు ఎనిమిది గంటలు పని విధానంపై ఆమధ్య దీపిక పదుకొణె చేసిన కామెంట్స్‌‌‌‌ ఎంతలా సంచలనం రేపాయో తెలిసిందే. అయితే ఇప్పుడు వృత్తి పట్ల నిబద్ధత, అంకితభావంతో ఆమె ఆశ్చర్యపరుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ తెరకెక్కిస్తున్న ‘రాకా’ చిత్రంలో దీపిక హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్‌‌‌‌. త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతోంది.

ఏడు నెలల గర్భంతోనూ ప్రస్తుతం ఆమె ఈ మూవీ షూటింగ్‌‌‌‌లో పాల్గొంటోంది. రాత్రి వేళల్లోనూ పనిచేస్తూ, రిస్కీ యాక్షన్ సీన్స్‌‌‌‌ చిత్రీకరణలో ఆమె పాల్గొంటోంది. ఓవైపు ఏడాదిన్నర కూతురు దువా బాధ్యతలను చూసుకుంటూనే ఇలా షూటింగ్‌‌‌‌లో కష్టపడటం ఎంతో స్ఫూర్తినిస్తోందని టీమ్‌‌‌‌ మెంబర్స్‌‌‌‌ చెబుతున్నారు. మెటర్నిటీ బ్రేక్‌‌‌‌ తీసుకోవడానికి ముందే సినిమాలో తన పార్ట్‌‌‌‌ షూటింగ్‌‌‌‌ను పూర్తి చేయాలనే పట్టుదలతో దీపిక ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో ఎనిమిది గంటల  పని విధానం కోసం స్పిరిట్‌‌‌‌,  కల్కి 2 సినిమాలను వదులుకున్న ఆమె.. ఇప్పుడిలా ఎలాంటి నిబంధనలు లేకుండా షూటింగ్‌‌‌‌ చేస్తుండడంపై నెటిజన్స్‌‌‌‌ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు షారుక్‌‌‌‌ఖాన్‌‌‌‌ 'కింగ్' చిత్రంలోనూ ఆమె నటిస్తోంది.