దీక్షిత్ శెట్టి ‘కింగ్ జాకీ క్వీన్’ రిలీజ్ డేట్ ఫిక్స్

దీక్షిత్ శెట్టి ‘కింగ్ జాకీ క్వీన్’ రిలీజ్ డేట్ ఫిక్స్

దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా లీడ్ రోల్స్‌‌‌‌లో  నటించిన చిత్రం ‘KJQ’  (కింగ్ జాకీ క్వీన్). ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌వీ సినిమాస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై  సుధాకర్ చెరుకూరి నిర్మించారు.   ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన కేకే  గత ఏడాది కన్నుమూశారు.

ఆయనకు  సినిమాపై ఉన్న  ప్యాషన్, విజన్‌‌‌‌కి నివాళిగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఆగస్టు 7న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు శుక్రవారం ప్రకటించారు.  వినూత్నమైన టైటిల్, ఆకట్టుకునే ఫస్ట్ లుక్ పోస్టర్, పవర్‌‌‌‌ఫుల్ టీజర్‌‌‌‌తో ఇప్పటికే  ఈ సినిమాపై  అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా రిలీజ్ చేసిన అనౌన్స్‌‌‌‌మెంట్ పోస్టర్స్‌‌‌‌ కూడా మూవీపై మంచి బజ్‌‌‌‌ను క్రియేట్ చేశాయి.  ఈ చిత్రానికి నాగేశ్ బనెల్ సినిమాటోగ్రఫీ అందించగా, పూర్ణచంద్ర తేజస్వి సంగీతం అందిస్తున్నాడు.