బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

వేములవాడ, వెలుగు: బోనాలు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శ్రీ చెన్నకేశవ మత్తడి పోచమ్మ అమ్మవారిని శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వాగతం పలికి, అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. 

అనంతరం విప్ మాట్లాడుతూ అమ్మవారి కటాక్షంతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు తోట శేఖర్, తోట రాజు, చిలుక రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కొమురయ్య, ఆగయ్య, నాగుల విష్ణుప్రసాద్ పాల్గొన్నారు.