- ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిత్
కరీంనగర్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్(జీపీఎఫ్), పింఛన్ సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు వాటిని పూర్తిగా డిజిటలైజేషన్ చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిత్ తెలిపారు. పింఛన్, జీపీఎఫ్ సేవల అదాలత్‌తో పాటు అకౌంట్స్, ఆడిట్, పింఛన్, జీపీఎఫ్ అంశాలపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి వర్క్‌షాప్‌ను శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించారు.
తెలంగాణ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం, జిల్లా కలెక్టరేట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అదాలత్‌కు విశేష స్పందన లభించింది. పింఛన్, జీపీఎఫ్ నగదు జమలో ఎదురవుతున్న సమస్యలపై ఉద్యోగులు దరఖాస్తులు సమర్పించగా, కొన్ని సమస్యలను అధికారులు స్పాట్లో పరిష్కరించారు. మిగిలిన దరఖాస్తుల పరిష్కారానికి రిటైర్డ్ ఉద్యోగులు, డీడీవోలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా చందా పండిత్ మాట్లాడుతూ, ఉద్యోగుల పదవీ విరమణ తేదీ ముందుగానే తెలిసే అవకాశం ఉన్నందున.. కనీసం మూడు నెలల ముందే పింఛన్ ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని సూచించారు. '
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ నరేశ్‌కుమార్, డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ అభయ్ అనిల్ సోనార్కర్, జిల్లా ట్రెజరీ అధికారి నాగరాజు, కలెక్టరేట్ ఏవో సుధాకర్ పాల్గొన్నారు.
