డోలీలో రోగి తరలింపు.. ములుగు జిల్లాలో ఆదివాసీల పరిస్థితి ఇది..!

డోలీలో రోగి తరలింపు.. ములుగు జిల్లాలో ఆదివాసీల పరిస్థితి ఇది..!


ఏటూరునాగారం, వెలుగు: ప్రభుత్వాలు మారుతున్నా మారుమూల ఆదివాసీ గ్రామాల పరిస్థితి మాత్రం మారడం లేదు. సరైన రహదారులు లేక అనారోగ్యానికి గురైన రోగులను ఇప్పటికీ డోలీల్లో మోసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం గుర్రాలబావికి చెందిన గుత్తికోయ యువకుడు మడకం అయితయ్య నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఆర్‌‌ఎంపీ వద్ద చికిత్స పొందుతున్నాడు. 

శుక్రవారం అతడి పరిస్థితి విషమించి అపస్మారక స్థితికి చేరడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌‌కు సమాచారం ఇచ్చారు. ఈఎంటీ శివలింగం ప్రసాద్, పైలట్ కోటి గ్రామానికి చేరుకున్నప్పటికీ రహదారి లేక అంబులెన్స్ ముందుకు వెళ్లలేకపోయింది. దీంతో వారు డోలీ కట్టి సుమారు రెండు కిలోమీటర్ల దూరం రోగిని మోసుకొచ్చి అంబులెన్స్‌‌లోకి ఎక్కించారు. అనంతరం ప్రథమ చికిత్స అందించి ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించారు. సకాలంలో స్పందించి రోగిని ఆస్పత్రికి చేర్చిన 108 అంబులెన్స్ సిబ్బందిని స్థానికులు అభినందించారు.