జనగామ అర్బన్, వెలుగు : జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయాన్ని శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ కమిటీతో పాటు అన్ని అనుబంధ సంఘాల మధ్య సమన్వయం పెంపొందిస్తూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లకావత్ అన్ని విధాలా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. సమిష్టిగా పనిచేస్తే జనగామ జిల్లాలో కాంగ్రెస్ మరింత బలపడుతుందన్నారు.
