కరీంనగర్:పోలీసుల తీరుపై ఎమ్మెల్యే గంగుల ఆగ్రహం

 కరీంనగర్:పోలీసుల తీరుపై  ఎమ్మెల్యే గంగుల ఆగ్రహం

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలో గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల ఆంక్షలు వివాదాస్పదంగా మారాయి. స్థానిక సప్తగిరి కాలనీలో వినాయక మండపాల ఏర్పాటుకు పోలీసులు అనుమతులు నిరాకరించడంతో, కాలనీవాసుల అభ్యర్థన మేరకు కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం కాలనీకి చేరుకుని పోలీసుల తీరుపై మండిపడ్డారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 38 ఏళ్లుగా ఈ ప్రాంతంలో ప్రజలు గణపతి, దుర్గా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారని, కానీ ఇప్పుడు మండపాలు పెట్టవద్దని చెప్పడం ఎంతవరకు సమంజసమని పోలీసులను ప్రశ్నించారు. కేవలం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, ఇతర మండపాలకు అనుమతులు నిరాకరించడం సరికాదన్నారు. బొమ్మకల్ హనుమాన్ విగ్రహం చోరీ ఘటనను ఆయన ప్రస్తావిస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.