ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్‌లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) పనులు త్వరగా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థి సంఘం నాయకులు అంగరి ప్రదీప్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్మూర్ విద్యార్థి సంఘాల నాయకులు హైదరాబాద్‌లో మంత్రిని కలిశారు.
ఆర్మూర్‌కు మంజూరైన ఏటీసీ నిర్మాణం పెండింగ్‌లో ఉందని, పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్మూర్విద్యార్థి సంఘ నాయకుడు షాహిద్ అలీ మంత్రికి వినతిపత్రం అందజేశారు. స్పందించిన మంత్రి త్వరలో పనుల ప్రారంభానికి చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జమాత్-ఎ ఉల్మా ప్రతినిధి ఇబ్రాహీం, మర్కజ్ కమిటీ కార్యదర్శి రిజ్వాన్, జాఫర్ అలీ, షైబాజ్ పాల్గొన్నారు.
