నిజామాబాద్, వెలుగు: ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి విద్యార్థుల భవిష్యత్నునాశనం చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్విమర్శించారు. ఫీజులు కట్టలేని స్టూడెంట్స్ చదువులకు దూరమవుతున్నారని, ప్రభుత్వం వారి ఉసురు తీస్తోందన్నారు. శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల రణభేరి కార్యక్రమంలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. 40 శాతం కమీషన్ ఇస్తేనే ఫీజు బకాయిలు రిలీజ్ చేస్తామని కాలేజ్ మేనేజ్‌మెంట్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక రూ.12 వేల కోట్ల మేరకు ఫీజు బకాయి పడిందన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిల కోసం డబ్బులు లేవంటున్నారని, రాయదుర్గం, ఉస్మాన్‌నగర్‌లో ప్రభుత్వ ల్యాండ్ అమ్మగా వచ్చిన డబ్బు ఏం చేశారని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ డేంజరేస్ పాలన చేయగా రేవంత్‌రెడ్డి డిజాస్టర్ పాలన చేస్తున్నడన్నారు.
చంద్రబాబు దగ్గర నేర్చుకో..
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అడ్మినిస్ట్రేషన్ బాగుందన్న ఎంపీ అర్వింద్.. ఆయనను తన రాజకీయ గురువుగా చెప్పుకునే రేవంత్‌రెడ్డి.. ఆయన వద్దకు వెళ్లి పాలన నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌రెడ్డి, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ దినేష్, లీడర్లు మేడపాటి ప్రకాశ్ రెడ్డి, వడ్డీ మోహన్‌రెడ్డి, స్రవంతిరెడ్డి, ప్రదీప్, లక్ష్మీనారాయణ, శివ తదితరులు
పాల్గొన్నారు.
