బీర్కుర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఏడు నెలల చిన్నారిపై బ్లేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో దాడి ఎంక్వైరీ చేస్తున్న పోలీసులు

బీర్కుర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఏడు నెలల చిన్నారిపై  బ్లేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో దాడి ఎంక్వైరీ చేస్తున్న పోలీసులు

బీర్కుర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఏడు నెలల చిన్నారిపై బ్లేడుతో దాడి చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. కామారెడ్డి జిల్లా బీర్కుర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండల కేంద్రానికి చెందిన టేకు సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదటి భార్య శైలజకు ముగ్గురు ఆడపిల్లలు. దీంతో అతను ఆమె చెల్లె సంధ్యను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు 7 నెలల కింద ఆడపిల్ల పుట్టింది. 

అనంతరం కుటుంబంలో గొడవలు జరుగుతుండడంతో చిన్నారిని భర్త వద్ద వదిలేసి, సంధ్య పుట్టింటికి వెళ్లింది. ఈక్రమంలో మంగళవారం అర్ధరాత్రి పాపకు బ్లేడు గాయాలు చేసి పొదల్లో పడేశారు. మరునాడు పాపను గుర్తించి నిజామాబాద్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. కాగా అక్క శైలజ తన బిడ్డపై దాడి చేసిందని ఆరోపిస్తూ సంధ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.