దెబ్బకు ఇన్స్టాగ్రాం అకౌంట్ డీయాక్టివేట్ చేసిన ధర్మేంద్ర ప్రధాన్ కూతురు !

దెబ్బకు ఇన్స్టాగ్రాం అకౌంట్ డీయాక్టివేట్ చేసిన ధర్మేంద్ర ప్రధాన్ కూతురు !

ఢిల్లీ: కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు విద్యార్థుల నిరసనల సెగ తగిలింది. ధర్మేంద్ర ప్రధాన్ కూతురు నైమిషా ప్రధాన్ను సోషల్ మీడియాలో ‘ఫారెన్ డిగ్రీ’ అని ట్రోల్ చేయడంతో ఆమె.. దెబ్బకు ఇన్ స్టాగ్రాం అకౌంట్ను డీయాక్టివేట్ చేసింది.

నైమిషా ప్రధాన్ విదేశాల్లో చదువుకున్న సంగతి తెలిసిందే. అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్సిటీ సోషల్ మీడియా పేజ్ల కింద ఆమెను ట్రోల్ చేస్తూ కామెంట్స్ కనిపించాయి. ఆమెపై చర్యలు తీసుకోవాలని కామెంట్స్ చేశారు.

నైమిషా ప్రధాన్ టఫ్ట్స్ యూనివర్సిటీ పరిధిలోని ఫ్లెచర్ స్కూ్ల్లో LLM చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక US-India స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ఫోరమ్ (USISPF)లో సీనియర్ అసోసియేట్గా జాయిన్ అవడం గమనార్హం. ఆమె ఉన్నత విద్య అమెరికాలో ఎందుకు సాగిందని, భారతదేశంలో విద్యా వ్యవస్థపై నమ్మకం లేకపోవడం వల్లే ఆమె ఇండియాను వదిలి అమెరికాకు వెళ్లి చదువుకుందని నిరసనకారులు ట్రోల్ చేశారు.

నీట్ యూజీ వివాదంపై కేంద్ర ప్రభుత్వం అత్యంత స్పష్టమైన వైఖరితో ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికే ప్రకటించారు. అయితే.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాకే ఆందోళనలను విరమిస్తామని నిరసనకారులు తేల్చి చెప్పారు.

అప్పటివరకూ ఆందోళనలు కొనసాగుతాయని తెగేసి చెబుతున్నారు. ఈ వ్యవహారంపై పార్లమెంట్ వేదికగా చర్చించేందుకు ప్రభుత్వం 100 శాతం సిద్ధంగా ఉందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. దేశంలోని కోట్లాది మంది విద్యార్థులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు.