అక్టోబర్ నెల శ్రీవారి దర్శన కోటా, తిరుమల, తిరుపతిలో గదుల కోటా విడుదల చేసింది టీటీడీ. గురువారం ( జులై 23 ) ఉదయం 10 గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించి అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల చేసింది టీటీడీ. శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేసింది టీటీడీ.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ.
రేపు ( జులై 24 ) ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా :
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను శుక్రవారం ( జులై 24 ) ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపింది టీటీడీ.
ALSO READ : అయోధ్య విరాళాల కుంభకోణం : హుండీల లెక్కింపునకు ఐదుగురు సాధువులతో కమిటీ
తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల:
తిరుమల తిరుపతిలలో గదుల కోటాను శుక్రవారం ( జులై 24 ) మధ్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది టీటీడీ.
శ్రీవారి దర్శనం, తిరుమల తిరుపతిలలో వసతి గదుల కోటా కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని సూచించింది టీటీడీ.
