ఇందిరమ్మ ఇండ్ల నాణ్యతలో రాజీపడొద్దు : ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజర్షి షా

ఇందిరమ్మ ఇండ్ల నాణ్యతలో రాజీపడొద్దు :  ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజర్షి షా

గుడిహత్నూర్, వెలుగు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడొద్దని ఆదిలాబాద్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం ఉట్నూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం పెద్దసుద్దగూడ, గంగాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గుడిహత్నూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుడిగాలి పర్యటన చేశారు. పెద్దసుద్దగూడలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు ఆర్థిక సాయంతో పాటు విద్యుత్, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలను సత్వరమే కల్పించాలన్నారు. 

అనంతరం ఉట్నూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, గిరిజన బాలికల హాస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తనిఖీ చేశారు. స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముఖాముఖి మాట్లాడుతూ వారికి అందుతున్న వసతులు, విద్యాబోధన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం గంగాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రామంలో తెలంగాణ జలసిరి పథకం కింద నిర్మించిన నీటికుంటలను పరిశీలించారు. స్థానిక స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఏర్పాటు చేసిన పోషకాహార తోటను ఆయన ప్రారంభించారు. అంతకుముందు ఐటీడీఏ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్తున్న గిరిజన పర్వతారోహకులు మడావి కన్నీబాయి, కాత్లే ఆనందరావును సత్కరించారు. కార్యక్రమంలో డీఆర్డీవో రవీందర్, ఆర్డీవో మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సింగ్, ఎంపీడీవో రైసోద్దీన్, తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రఘునాథ్, ఐటీడీఏ ఏపీవోలు, అధికారులు పాల్గొన్నారు.