పదేళ్లల్లో.. ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా 152 పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయి.. ఇన్ని పేపర్స్ ఎందుకు లీక్ అవుతున్నాయి అనేది లోతుగా ఆలోచిస్తే బయటకు వచ్చిన ఘోరమైన నిజం ఏంటో తెలుసా.. నీట్, జేఈఈ వంటి ప్రతిష్టాత్మకమైన పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్ట్ ఏజెన్సీ్.. NTA విభాగంలో వందల మంది పని చేస్తున్నా.. అందులో కేవలం 24 మంది మాత్రమే పర్మీనెంట్ ఉద్యోగులు ఉన్నారు. కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్ నే కాకుండా.. దేశ నిర్మాణంలో కీలకమైన యువతకు తెలివితేటలు.. వాళ్ల చదువులను డిసైడ్ చేసే అత్యంత కీలకమైన NTA.. నేషనల్ టెస్ట్ ఏజెన్సీలో పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగులు కేవలం 24 మంది అంటే 24 మాంది మాత్రమే ఉండటం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మిగతా అందరూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే అంట.. అసలు NTAలో ఉద్యోగులు కథ ఏంటో పూర్తిగా తెలుసుకుందామా..
2018 నుంచి ఇప్పటివరకు ఏకంగా 6.6 కోట్లకు పైగా దరఖాస్తులను స్వీకరించిన ఈ సంస్థలో, పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉండటం గమనార్హం. ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఎన్టీఏలో కేవలం 24 మంది మాత్రమే శాశ్వత (పర్మనెంట్) ఉద్యోగులు ఉన్నారు. మిగతా 197 మంది కాంట్రాక్ట్ లేదా అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు.
విద్యా మంత్రిత్వ శాఖ ప్రకారం, ఎన్టీఏలో మొత్తం 39 శాశ్వత పోస్టులు ఉండగా, ప్రస్తుతం 24 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వీరిలో 1 డైరెక్టర్ జనరల్, 2 జాయింట్ సెక్రటరీలు, 8 మంది డైరెక్టర్లు, 6 మంది జాయింట్ డైరెక్టర్లు & రీసెర్చ్ సైంటిస్టులు, 3 డిప్యూటీ డైరెక్టర్లు, 2 అసిస్టెంట్ డైరెక్టర్లు, 2 సీనియర్ సూపరింటెండెంట్లు ఉన్నారు. ఎన్టీఏ శాశ్వత సిబ్బంది కంటే కాంట్రాక్ట్, అవుట్‌సోర్స్ ఉద్యోగులపైనే ఎక్కువగా ఆధారపడుతోంది.
73 మంది కాంట్రాక్ట్ ఉద్యోగలలో 44 మంది కన్సల్టెంట్లు, 17 మంది యంగ్ ప్రొఫెషనల్స్, 5 గురు సీనియర్ కన్సల్టెంట్లు, 3 సలహాదారులు, ఒక సీనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఉన్నారు. మరో 124 మంది అవుట్‌సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్నారు.
ALSO READ : ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ కష్టం గానీ ఈ పని చేసేందుకు కేంద్రం సిద్ధం ?
270కి పైగా పరీక్షల నిర్వహణ
2018లో ప్రారంభమైనప్పటి నుంచి ఎన్టీఏ దేశవ్యాప్తంగా 270కి పైగా పోటీ పరీక్షలను నిర్వహించింది. ముఖ్యంగా మెడికల్, ఇంజనీరింగ్, టీచింగ్ రంగానికి చెందిన కీలక పరీక్షలన్నీ. అయితే, ఇటీవలే ఎన్టీఏలో 16 కొత్త పోస్టులను భర్తీ చేసినట్లు విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
