ధన దాహంతో విద్యావ్యవస్థలోని కొందరు అక్రమార్కులు ఒక పెద్ద చీకటి వ్యవస్థనే సృష్టిస్తున్నారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును, వారి కష్టాన్ని ఈ అవినీతి జాలం తీవ్ర ప్రశ్నార్థకంగా మారుస్తోంది. పేపర్ లీకుల కారణంగా అర్హత ఉన్న ప్రతిభావంతులకు అన్యాయం చేస్తూ, డబ్బున్న అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న ఈ ధోరణి సమాజానికి తీవ్ర ముప్పుగా మారిపోయింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి.. వ్యవస్థలోని తప్పులను ఒప్పుకుని సరిదిద్దాల్సింది పోయి, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మౌనం వహిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు తీవ్రస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి.
సరిగ్గా దేశవ్యాప్తంగా ఈ పేపర్ లీక్ వివాదం సంచలనంగా మారిన వేళ.. ఈ చీకటి కోణాన్ని, విద్యార్థుల ఎమోషన్స్‌ను కళ్లకు కట్టేలా ZEE5 ప్లాట్‌ఫారమ్ ‘ది స్కామ్: లీక్డ్’ (The Scam: Leaked) అనే సరికొత్త వెబ్ సిరీస్‌తో ముందుకు వచ్చింది. లేటెస్ట్గా విడుదలైన ఈ సిరీస్ టీజర్, విద్యా వ్యవస్థలోని లొసుగులను సూటిగా ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. కేవలం నిమిషం 9 సెకన్ల నిడివితో వచ్చిన ఈ టీజర్ ఆలోచింపజేసేలా ఉంది. ‘ఒకే ఒక్క పేపర్.. లక్షలాది కలలు.. ఒకే ఒక్క లీక్.. దేశం మొత్తం ఆశ్చర్యంలో!’’ అనే పవర్‌ఫుల్ క్యాప్షన్‌తో జీ5 ఈ టీజర్ను రిలీజ్ చేసింది.
అగ్గిరాజేసిన ‘ది స్కామ్’ టీజర్?
టీజర్‌లో ప్రశ్నాపత్రాల ప్రింటింగ్ ప్రక్రియ, వాటి భద్రతా ఏర్పాట్లు, ప్యాకింగ్, రవాణా వంటి అంశాలను చూపించారు. అత్యంత భద్రత మధ్య తరలించే ప్రశ్నాపత్రం ఒక మొబైల్ ఫోన్ ద్వారా ఫోటో తీసి, PDF రూపంలోకి మార్చి లీక్ చేసినట్లు చూపించారు. ఆ తర్వాత ఈ పేపర్ లీక్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారడం, పరీక్ష రద్దు చేయాలనే డిమాండ్లు, మళ్లీ పరీక్ష నిర్వహించాలని విద్యార్థులు కోరడం వంటి సంఘటనలను టీజర్‌లో మలిచారు. ముఖ్యంగా టీజర్ చివర్లో పేపర్ లీక్ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు చూపించడం నెటిజన్లను తీవ్రంగా కలిచివేస్తోంది.
లీక్ స్కామ్‌పై చర్చను పీక్స్‌కి తీసుకెళ్లిన ZEE5..
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వీధులు విద్యార్థుల నిరసనలతో హోరెత్తుతున్న వేళ.. ZEE5 ప్లాన్ చేసిన టైమింగ్ చూసి అందరూ మైండ్ బ్లాంక్ అవుతున్నారు. ఒకవైపు NEET పేపర్ లీక్ వివాదంపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ మద్దతుతో వేలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి సంస్కరణల కోసం పోరాడుతున్నారు.
రీసెంట్‌గా వీరు చేపట్టిన ‘చలో సంసద్డ్’ మార్చ్‌పై పోలీసులు జరిపిన లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పొలిటికల్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. సరిగ్గా ఇలాంటి తీవ్ర ఉత్కంఠ వాతావరణంలోనే.. ZEE5 తన సంచలనాత్మక వెబ్ సిరీస్ ‘ది స్కామ్: లీక్డ్’ (The Scam: Leaked) టీజర్‌ను దించేసి లీక్ స్కామ్‌పై చర్చను పీక్స్‌కి తీసుకెళ్లింది. ఈ క్రమమంలోనే "ఇది కదా అసలైన ఐ-ఓపెనర్ అండ్ పర్ఫెక్ట్ టైమింగ్!" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కళ్లారా చూస్తున్న డార్క్ రియాలిటీ: రోజువారీ విద్యా వ్యవస్థలోని లోపాలు, ప్రశ్నాపత్రాల లీకేజీ వెనుక ఉన్న చీకటి కోణాలు, న్యాయం కోసం విద్యార్థులు పడుతున్న ఆవేదనను ఈ సిరీస్ ఎలాంటి సెన్సార్‌షిప్ లేకుండా ఎంత బోల్డ్‌గా చూపించబోతోందోనని ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. మొత్తంగా విద్యా వ్యవస్థలో కల్తీ, విద్యార్థుల పోరాటాల చుట్టూ తిరిగే ఈ సిరీస్ రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ అగ్గిరాజేస్తుందో చూడాలి.
ZEE5 is the most courageous OTT platform right now! 💯
— Bollywood Talkies (@bolly_talkies) July 22, 2026
First #Satluj, and now they have just released another series, #TheScamLeaked, which is about a competitive exam leak!
What ZEE5 is doing, I wish more mainstream news channels had done the same. pic.twitter.com/f2Iqa8tKLS
Gandhi Maidan, Patna
— Nehr_who? (@Nher_who) July 22, 2026
Bihar Police lathicharged & used water cannons on students protesting against Paper leak and police brutality at JANTAR Mantar
This is the Most Anti-students Govt ever pic.twitter.com/Uj3EMviOh8
