జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల పట్టణంలో గత రాత్రి నుంచి కురుస్తున్న ముసురుతో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోకి నీళ్లు వచ్చాయి. కొద్దిపాటి వర్షానికే ఆసుపత్రి ప్రాంగణంలోకి వర్షపు నీరు చేరి వార్డులు, కారిడార్లలో నిలిచింది.
దీంతో చికిత్స కోసం వచ్చిన రోగులు, వారి సహాయకులు ఇబ్బందులు పడ్డారు. గోడల్లోంచి వర్షపు నీరు కారుతుండడంతో రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీటిని తొలగించేందుకు ఆసుపత్రి సిబ్బంది ప్రయత్నించారు.
