మంచిర్యాల జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం ( జులై 23 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా 30 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది బాలికలను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురు బాలికల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. మిగతావారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు వైద్యులు.
ALSO READ : జగిత్యాల పట్టణంలో ముసురుకే ప్రభుత్వ దవాఖానలోకి నీరు
ఉదయం టిఫిన్ తిన్న తర్వాత కడుపు నొప్పి, వాంతులు విరేచనాలు మొదలయ్యాయని అంటున్నారు విద్యార్థినులు. ఫుడ్ పాయిజన్ కు గల కారణాలపై ఆరా తీస్తున్నారు అధికారులు. సిబ్బంది నిర్లక్ష్యమే ఘటనకు కారణమని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు అధికారులు.
