మేఘాలయ హనీమూన్ కేసు గుర్తుండి ఉండే ఉంటుంది. హనీమూన్ కు తీసుకెళ్లి భర్తను కిరాతకంగా చంపేసిన కేసులో నిందితురాలికి సుప్రీం కోర్టు షాకిచ్చింది. భర్తను చంపిన కేసులో భార్య సోనమ్ రఘువంశీ బెయిల్ క్యాన్సిల్ చేస్తూ తీర్పు ఇచ్చింది.
గురువారం (జులై 23) బెయిల్ పిటిషన్ పై వాదనలు విన్న జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ పీబీ వారాలే లతో కూడిన బెంచ్.. సోనమ్ రఘువంశీ బెయిల్ చేయడంతో పాటు.. 3 వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. విచారణ వేగవంతంగా సాగకపోతే.. మరోసారి బెయిల్ పిటిషన్ అప్పీల్ చేయవచ్చునని సూచించింది.
ఇండోర్‌కు చెందిన 25 ఏళ్ల మహిళ, తన భర్త రాజా రఘువంశీతో కలిసి 2025 మే నెలలో హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. ఆ ట్రిప్ లో ఈ దంపతులు కనిపించకుండా పోయారు. వారం రోజుల తర్వాత ఒక లోతైన లోయలో రాజా మృతదేహం లభ్యమైంది. కిరాయి ఇచ్చి భర్తను హత్య చేయాలని సోనమ్ పథకం వేసినట్లు విచారణలో తేలింది. ఆమెను జూన్ 2025లో అరెస్టు చేశారు.
2026 ఏప్రిల్ లో షిల్లాంగ్ ట్రయల్ కోర్టు సోనమ్‌కు బెయిల్ మంజూరు చేయగా, జూన్ చివరలో మేఘాలయ హైకోర్టు ఆ నిర్ణయాన్ని సమర్థించింది. అయితే, ఆమెకు బెయిల్ పొందే అర్హత లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు బెయిల్ అభ్యర్థనను తిరస్కరించింది. మూడు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది.
