ఏకాగ్రత కోసం దయాగుణ ధ్యానం చాలా ముఖ్యమని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. ధ్యానం అంటే కళ్లు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టడమే అని చాలామంది అనుకుంటారు. కానీ ధ్యానంలో అదొక్కటే కాదు. ఎన్నో రకాలున్నాయి. మనిషి తీరు, ఆలోచించే విధానం, లైఫ్ స్టైల్ ను బట్టి ఒక్కొక్కరు ఒక్కోరకమైన ధ్యా నాన్ని ఎంచుకోవచ్చు. అయితే ఏకా గ్రతతో కాకుండా ప్రేమతో, కరుణతో చేసే ధ్యానం ఒకటుంది. అదే 'మెట్టా మెడిటేషన్'. దీన్నే దయాగుణ ధ్యానం, కరుణ ధ్యానం, ప్రేమ ధ్యానం అంటారు.
విపశ్చన, అనాశన, కరుణ (మెట్టా) ధ్యానాలు సనాతన ధ్యాన పద్ధతులు. ఇవన్నీ బుద్ధుడు చెప్పిన మెడిటేషన్ స్టైల్స్ అయితే ఇందులో చాలా రకాలు మెడిటేషన్లు ఎంతో ఏకాగ్రతతో చేయాల్సి ఉంటుంది. వాటిని ప్రాక్టీస్ చేయడం అందరికీ అంత ఈజీ కాకపోవచ్చు. అయితే బుద్ధుడు చెప్పిన మెట్టా మెడిటేషన్ మాత్రం ఇప్పుటి లైఫ్ స్టైల్ కు సరిగ్గా సరిపోతుంది.
ఇది మైండ్ ఫుల్ , మనను నిండా ప్రేమ నింపుకుని చేసే ధ్యానం. మెట్టా మెడిటేషన్లో 'మెట్టా' అనేది పాళి భాషనుంచి వచ్చిన పదం. మెట్టా అంటే ప్రేమ పూర్వకమైన, దయ, స్నేహము, అహింస లాంటి అర్థాలున్నాయి. ప్రేమ పూర్వకమైన భావనకు మనసు నిండా నింపుకుని కరుణను విజువలైజ్ చేసుకోవడమే ఈ మెడిటేషన్లోని టెక్నిక్.
ALSO READ : భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గకూడదా ?
మెట్టా మెడిటేషన్ ను ప్రశాంతంగా మొదలు పెట్టాలి. నిటారుగా కూర్చొని, ప్రశాంతంగా, నిశ్శబ్దంగా, ఎలాంటి ఆలోచనలు లేకుండా, మనసు నిండా సానుభూతి, ప్రేమతో ఉండాలి. మెల్లగా డీప్ బ్రీత్ తీసుకుంటూ శ్వాసను పరిశీలిస్తుండాలి. శ్వాసను పూర్తిగా లోపలికి తీసుకుని, పూర్తిగా బయటకు వదులుతుందాలి. ఇలా నాలుగైదు నిముషాలు చేయాలి ఇలా లోతైన శ్వాసలు తీసుకునేటప్పుడు శ్వాసను గుండెలోకి వెళ్లి వస్తున్నట్లు అనుభూతి చెందాలి. ఇలాకొంత సేపు చేసిన తర్వాత మనసు కొంతవరకూ రిలాక్స్ అవుతుంది..
శరీరం, మనము రిలాక్స్ అయ్యాక మనసులో. "నేను సంతోషంగా ఉన్నాను. నేను ప్రశాంతంగా ప్రేమతో ఉన్నాను. ప్రపంచమంతటా ప్రేమే నిండి ఉంది. ప్రపంచమంతా సంతోషంగా ఉండాలి అని అనుకోవాలి. ఇలా అనుకుంటూనే లోతైన శ్వాసలను హృదయంతో అనుభూతి చెందుతూ ఉండాలి. మనసు మరింత రిలాక్స్ అయ్యాక గ్రాటిట్యూడ్ ఫీలవ్వాలి. అంటే మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తున్న ప్రకృతిపై ఈ భూమిపై అలాగే.. నాబెట్టిన అనుభవాల్ని అందిస్తున్న సొసైటీ చుట్టూ ఉన్న పరిసరాలు. చెట్లు, జంతువులు. ఇలా మన ఉనికికి కారణమైన అన్ని విషయాలపై కృతజ్ఞతా భావనతో ఉండాలి
అసూయను వదిలేస్తూ..
మనకు ఇష్టంలేని వాళ్లను. శత్రువులను కూడా ప్రేమిస్తున్నట్టువాళ్లపై ఉన్న కోపం మనలోంచి బయటకు పోతున్నట్లు ఫీలవ్వాలి. ఈ ధ్యానం విజువలైజేషన్ క్కు సంబంధించింది. ఎలా ఊహించుకుంటే మనసు రిలాక్స్ అవుతుందో అలా తోచినట్లు విజువలైజ్ చేసుకోవాలి. కాసేపు ప్రేమ, కరుణతో నిండిన ఊహా ప్రపంచంలోకి వెళ్లాలి. మన చుట్టూ ఉన్న అన్ని విషయాలపై దయాగుణంతో ఉండాలి. ద్వేషం, కోపం, అసూయ, హింస ఇవన్నీ మనలోంచి బయటకు వెళ్తున్నట్లు ఫీలవ్వాలి కొన్ని నిముషాల పాటు ఈధ్యానాన్ని చేస్తూ ఉంటే మనసులోంచి.నెగటివ్ థాట్స్ బయటకు పోవడాన్ని గమనించొచ్చు. కొద్ది సేపటికి మనసు ప్రశాంతంగా, కరుణతో నిండిపోతుంది.
మంచి మెడిసన్
రోజూ ఒత్తిడి, యాంగ్జైటీతో బాధపడే వాళ్లకు.. రకరకాల ప్రొబ్లమ్స్ తో సతమతమవుతున్నవాళ్లకు మానసిక ప్రశాంతత కరువైన వాళ్లకు ఈ మెడిటేషన్ మంచి మెడిసిన్ పనిచేస్తుంది. ఈ మెడిటేషన్ రోజూ ప్రాక్టీస్ చేయడం వల్ల మనసులో ప్రేమ, కరుణ లాంటి భావాలు పెంపొందుతాయి. ఈర్ష, అసూయ లాంటి నెగిటివ్ ఫీలింగ్స్ నుంచి ఈజీగా బయటపడొచ్చు. ఈ మెడిటేషన్ స్వార్థం, కోపం, భయాలకు విరుగుడులా పనిచేస్తుంది.
ఇదొక సాధనం
ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ నుంచి దూరమవ్వగలిగామో అప్పుడు నిజమైన ప్రశాంతతను పొందే వీలుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే.. అసలైన స్పిరిచ్యువల్ మెడిటేషన్ లోకి ఎంటర్ అవ్వడానికి ఇదొక సాధనంలా ఉపయోగపడుతుంది. ఎంతో డిస్టర్బ్డ్ గా, నెగిటివ్ ఛాట్స్ తో నిండి ఉన్న మైండ్ కు మెడిటేషన్ చేయడం సాధ్యం కాదు. అలాంటి వాళ్లు కొద్ది సేపు ధ్యానానికి కూర్చోగానే రకరకాల ఆలోచనలతో మెదడు ఇబ్బంది పెడుతుంది. అందుకే స్పిరిచ్యువల్ మెడిటేషన్ ప్రాక్టీస్ కు ముందు మెట్టా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం వల్ల నిజమైన ధ్యానానికి సపోర్ట్ చేసే మానసిక స్థితి ఇంప్రూన్ అవుతుంది.
వెల్ బీయింగ్ కోసం...
మెట్టా మెడిటేషన్, స్పిరచ్యువల్ ప్రాక్టీస్ చేసేవాళ్లకే కాకుండా.. మామూలు మనుషులకు కూడా ఎంతగానో సాయపడుతుంది. ముఖ్యంగా ఇది వెల్ బీయింగ్ ను ఇంప్రూవ్ చేస్తుంది. రిలేషన్ షిప్స్‌ను మరింత బలంగా మారుస్తుంది. ట్రామా బేస్డ్ డిసీజెస్ ను తగ్గించడానికి కూడా ఈధ్యానాన్ని వాడతారు. అన్నింటి కంటే ముఖ్యంగా ఈ ధ్యానం ద్వారా ప్రకృతిని.. చుట్టూ ఉన్న మసుషుల్ని ఎలా ప్రేమించాలి?.ఎలాంటి అలజడులు లేకుండా మనసుని ప్రశాంతంగా ఎలా మలచుకోవాలో తెలిసొస్తుంది.
మెట్టా మెడిటేషన్ ను 2600 సంవత్సరాల క్రితానికి పైగా బుద్ధుడు బోధించాడు. ఇప్పటికీ దీన్ని ఎన్నో బౌద్ధ పాఠశాలలో భోధిస్తున్నారు. ఇందులో ఎక్కువగా విజువలైజేషన్, ఛాంటింగ్ లాంటివి ఉంటాయి. ఇది ధ్యానానికి ముందు ప్రిపరేషన్ లాంటిది. మెట్టా మెడిటేషన్ లో రకరకాల ఇబ్బందులతో భాధపడుతున్న వారికి వాటి నుంచి రిలీఫ్ అవ్వడానికి థెరపీలో ఈ ధ్యానాన్ని సూచిస్తారు. అలాగే బౌద్ధ గురువులు, స్పిరిచ్యువల్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేసేవాళ్లు ముందుగా ఈ మెడిటేషన్ తో ప్రాక్టీస్ మొదలుపెడతారు. నిజమైన ధ్యానంలో మెదడు తన ఆలోచనల్ని పూర్తిగా తగ్గిస్తుంది. కానీ అలా తగ్గించాలంటే ముందు అది ప్యూరిఫై అవ్వాలి. ఆ ప్యూరిఫికేషన్ మెట్టా ధ్యానంతో జరుగుతుంది.
