భార్యాభర్తల మధ్య బంధం హ్యాపీగా కొనసాగాలంటే కొన్ని టూల్స్ చాలా ఇంపార్టెంట్. ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉన్నా అది ఎక్స్ ప్రెస్ చేసుకోలేకపోతే అర్థం లేదు. రిలేషన్షిప్ లో ఎప్పుడూ ఎక్స్ప్రెసివ్ గా ఉంటూ, హ్యాపీ టూల్స్ ను యూజ్ చేసుకుంటేనే ఆ జంట హ్యాపీగా ఉంటుంది. ఈ విషయంలో ఎక్స్పర్ట్స్ చెప్తున్న కొన్ని టూల్స్ ఇవి...
టాక్ టు ఈచ్ అదర్
ఒకరితో ఒకరు మాట్లాడుకునే వీలు కూడా లేని రిలేషన్ షిప్ ఎక్కువ కాలం నిలబడదు. ఎవరు, ఎంత బిజీగా ఉన్నా ప్రతి రోజూ అన్ని విషయాలని షేర్ చేసుకోవాలి. ఒకరు చెప్పేది ఇంకొకరు వినాలి. అప్పుడే పార్టనర్ ను బాగా అర్థం చేసుకోగలుగుతారు లేదా ఎంతకాలంగా కలిసుంటున్నా ఒకరి గురించి ఇంకొకరికి పూర్తిగా తెలియదు. ఇంట్లో ఉంటే స్మార్ట్ ఫోన్స్ వాడుతూ ఒంటరిగా కాకుండా కలిసి మాట్లాడుకోవాలి.
స్టే కనెక్టెడ్
ఇద్దరూ వేరువేరు చోట్ల ఉన్నా, రోజంతా కనెక్టడ్ గా ఉండాలి. ఎప్పటికప్పుడు ఫోన్ చేసుకుంటూ లేదా మెసేజ్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ ఉన్నా పార్ట్నరకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో తెలియాలి. వీలున్నప్పుడల్లా కాల్ చేసుకుంటూ లంచ్ చేశావా అని అడగటం. అక్కడి విశేషాల్ని షేర్ చేసుకుంటూ ఉంటే బెటర్.
ఒకరికోసం ఒకరు
అప్పుడప్పుడైనా ఒకరికి ఇష్టమైన పని ఇంకొకరు చేయాలి. రెగ్యులర్ యాక్టివిటీస్ కావొచ్చు లేదా సర్ప్రైజ్ లు కావొచ్చు.. పార్టనర్ ను హ్యాపీగా ఉంచాలి. ఎప్పుడూ భార్యే వంట చేయడం కాకుండా, ఒకరోజు భర్త వంట చేయొచ్చు.
ALSO READ : వాతావరణం చల్లగా ఉందని, దప్పిక లేదని నీళ్లు తాగడం తగ్గించేశారా..?
గ్రాటిట్యూడ్
మీకోసం మీ భర్త/భార్య ఏ పని చేసినా దానికి విలువివ్వాలి. దీనివల్ల వాళ్ల పనికో గుర్తింపు దక్కినట్టు ఫీలవుతారు. చిన్న పొగడ్త చాలు. అది వాళ్లకెంతో ఆనందాన్ని ఇస్తుంది. ఒకరి తప్పుల్ని ఇంకొకరు విమర్శించడం కాకుండా, అర్థం చేసుకుని క్షమించడం నేర్చుకోవాలి.
వర్క్ షేరింగ్
ఏ పనిలోనైనా ఒకరికొకరు సాయంగా ఉండాలి. వీలున్నప్పుడల్లా వంట చేయడం, ఇంటి పని, షాపింగ్, గార్డెనింగ్.. ఇలా అన్నింట్లో భార్యకు సాయం చేస్తూ ఉంటే హ్యాపీగా ఫీలవుతుంది.
ఫన్ అండ్ లాఫ్ టుగెదర్
ఎవరి ఫోన్లో వాళ్లు బిజీగా ఉండకుండా ఇద్దరూ కలిసి టీవీ చూడటం అలవాటు చేసుకోవాలి. కలిసి సినిమా చూడొచ్చు. లంచ్, డిన్నర్ తప్పనిసరిగా కలిసే చేయాలి.
