యాదగిరిగుట్ట, వెలుగు: ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గుతున్న నేపథ్యంలో ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టుకోవాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ చీఫ్ బీర్ల అయిలయ్య పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణంపై బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
వర్షపు నీటితో పాటు ఇండ్లలో వృథాగా పోయే నీటిని భూగర్భ జలాలుగా మార్చేందుకు ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలను తప్పనిసరిగా నిర్మించుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు.
అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ గుండ్లపల్లి వాణీ భరత్ గౌడ్, వైస్ చైర్మన్ బరిగె రమ్య రాంచందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌తో కలిసి నీటి సంరక్షణ అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
