కట్టంగూర్ (నకిరేకల్), వెలుగు: నల్గొండ జిల్లా కట్టంగూర్ పోలీస్ స్టేషన్‌లో 2015లో నమోదైన వరకట్న వేధింపులు, భార్య మరణానికి సంబంధించిన కేసులో నిందితుడు సురారపు సైదులుకు నల్గొండ మహిళా కోర్టు కమ్ 4వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు.
కట్టంగూర్ మండలం యర్రసానిగూడెం గ్రామానికి చెందిన నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 304(బి) కింద 10 ఏండ్ల కఠిన జైలు శిక్షతో పాటు, వరకట్న నిషేధ చట్టం సెక్షన్ 4 కింద ఆరు నెలల సాధారణ జైలు శిక్ష, రూ. 5,000 జరిమానా విధిస్తూ, రెండు శిక్షలూ ఏకకాలంలో అమలులో ఉంటాయని కోర్టు తీర్పునిచ్చింది.
అప్పటి దర్యాప్తు అధికారులు ఎం. విజయ ప్రకాశ్, బి. రాములు నాయక్, ఎస్. సుధాకర్ సమర్థవంతంగా విచారణ జరపగా, ప్రభుత్వ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఆర్. అఖిల, జి. వెంకట రమణా రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీవాణి దామోదరం వాదనలు వినిపించారు. కాగా, మహిళల భద్రతకు విఘాతం కలిగించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని పేర్కొంటూ కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన దర్యాప్తు, ప్రాసిక్యూషన్ బృందాలను ఎస్పీ శరత్ చంద్ర పవార్
అభినందించారు
